Sree Narayana Guru
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 350. అశోకన్ వెంగశ్శేరి కృష్ణన్ కేరళలోని కొట్టాయం జిల్లా చెంగనాశ్చేరికి దగ్గరలోని ఒక కుగ్రామంలో జన్మించారు. ప్రాధమిక విద్య అనంతరం కేరళ విశ్వ విద్యాలయం నుండి గణితశాస్త్రంలో బి.యస్. డిగ్రీ అందుకున్నారు. కేరళ విద్యాశాఖలో పనిచేస్తూ 1985లో అమెరికాకు వలసవెళ్ళి చదువు కొనసాగించారు. పెన్సిల్వేనియా, వైడనర్ విశ్వవిద్యాలయం నుండి బి.యస్. డిగ్రీ ఇంకా యం.బి.ఎ. పట్టభద్రులయ్యారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ఇంకా మరికొన్ని ప్రాంతీయ విద్యా సంస్థల నుండి ఆంగ్ల సాహిత్యం, మానసికశాస్త్రం, సామాజికశాస్త్రం, పాశ్చాత్య చరిత్ర, నైతికశాస్త్రంలాంటి విషయాలలో తన చదువును కొనసాగించారు. దాదాపు 3 దశాబ్దాలు ఫిలడెల్ఫియా కేంద్రంగా వున్న ఒక అంతర్జాతీయ సంస్థలో పనిచేసారు. అక్కడినుండి భారతదేశానికి వచ్చి కొద్ది సంవత్సరాలపాటు ఇక్కడవున్నప్పుడు ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించారు. మళ్ళీ అమెరికాకు తిరిగివచ్చి అదే సంస్థలో సీనియర్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ అయ్యారు. కేరళలోని అనేక వార్తా పత్రికలలో అశోకన్ సామాజిక, రాజకీయ విశ్లేషణలు చేస్తూ వ్యాసాలు రాశారు. అవి అమెరికాలో భారతీయులకు సంబంధించిన పత్రికలలో కూడా ప్రచురితమయ్యాయి. కేరళలోని కొట్టాయం నుండి వెలువడే కమండలం అనే మలయాళ మాసపత్రికలో శీర్షిక రచయితగా 15 సంవత్సరాలపాటు రాశారు. అశోకన్ 2004లో అమెరికన్ డైరీ పేరుతో వ్యాస సంపుటిని ప్రచురించారు. ఆ పుస్తకానికి కేరళ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ప్రఖ్యాత నవలా రచయిత పెరుంఐదోవం శ్రీధరన్ ముందుమాట రాశారు. అశోకన్ ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివసిస్తూ తరచూ భారతదేశం వస్తుంటారు, తత్వశాస్త్రం, చరిత్ర ఆయనకు ఇష్టమైన విషయాలు. అశోకన్ శ్రీ నారాయణ గురు తాత్వికతకు గొప్ప విశ్వాసి, ఎన్నో సంవత్సరాలపాటు ఆయన జీవితంపై, తత్వంపై పరిశోధన చేసారు. మానవాళి మంచికోసం తపించిన మహనీయుని జీవితాన్ని, సిద్ధాంతాలను మీ ముందుంచడంలో రచయిత కృతకృత్యులయ్యారు.