Srama Dopidi Prapanchanni Marchaali !
Ranganayakamma / రంగనాయకమ్మ · Books

Price: Rs. 45. నేను, మొట్ట మొదట, ఇంకా 'కాపిటల్' చదవక ముందు, ఆ పేరుని ఇతర పుస్తకాల్లో చదివినప్పుడు, వెంటనే ఆ పుస్తకాన్ని కళ్ళతో చూడాలనీ, వెంటనే ఆ పేజీలు తిరగేస్తూ అక్కడక్కడా చదవాలనీ, అదే తక్షణ కర్తవ్యం అనీ, అనుకున్నాను. 'శ్రమ దోపిడీ' ఎలా జరుగుతోందో వివరించే పాఠాలన్నీ అందులో వున్నప్పుడు, అది చదవకుండా నేర్చుకోగలిగేదేమీ వుండదని మొదట్లోనే అనుకున్నాను. వెంటనే మొదటి భాగం తెచ్చుకోవడమూ, చదవడమూ, ఆ మర్నాడే ప్రారంభించాం. కానీ, మొదటి చాప్టర్ని మార్క్సు తేలిగ్గా చెప్పలేదు. అక్కడ విషయాల్లో కష్టం ఏమీ వుండదు. కానీ చెప్పడం తేలిగ్గా లేదు. పైగా, ఆ పదజాలం అంతా కొత్త. వాక్యాలు చాలా పెద్దవి. ఎవరినైనా సహాయం అడుగుదామంటే, మాకు తెలిసిన వాళ్ళల్లో, ఆ పుస్తకం చదివిన వాళ్ళెవరూ లేరు. ఒకాయన కొంచెం చెప్పడానికి ప్రయత్నించాడు గానీ, దాని వల్ల ప్రయోజనం లేక పోయింది. ఇక, సహాయాల కోసం ఎదురుచూడ్డం ఆపేసి, ఇంగ్లీషు డిక్ట్లరీలు పెట్టుకుని, మా కృషి మేం మొదలుపెట్టాం. కొంత దూరం పోయేటప్పటికి, అర్ధమవడం మొదలైంది. భయం తగ్గింది. వాడ కొన్ని చాప్టర్లు పూర్తి చేసేటప్పటికి, “ఇది తెలుగు పాఠకుల కోసం చెప్పాలి” అని గట్టిగా అనిపించింది నాకు. ఆ రకంగా నేను, “కాపిటల్ పరిచయం" రాసే పని ప్రారంభించి క్రమంగా పూర్తి చెయ్యగలిగాను. ఆ తర్వాత విశాలాంధ్ర వారు, 'కాపిటల్' కి తెలుగులో పూర్తిగా అనువాదం చేయించారు. అది, 3 సంపుటాలుగా వుంది.