Spurthishikaram
Editor · Stories & Poetry

Price: Rs. 15. సుందరయ్యగారి మీద రాసిన ఈ సుదీర్ఘ కవిత చాలా సుందరంగా వుంది. నేను ఇష్టపడే సునాయాస శైలిలో వుంది. లాకులు దాటిన తరువాత ప్రవహించే కాలువలా వుంది ఆనందాచారి నడక. -దేవిప్రియ జీవిత కథనంపై కవనం పట్టుగా నడపడం కష్టమైనా ప్రక్రియా పరమైన ప్రతిభచూపించి ఆద్యంతం తూకం తూగు కొనసాగించాడు. సమకాలీన పరిణామాలను చెబుతూ గతంలోకి తీసుకెళ్లడం, గతం చెబుతూ వర్తమానంలోకి దూకించడం ఇలా పలురకాల పద్ధతులను పాటించడం వల్ల ఇది సాధ్యమైంది. సందర్భోచితమైన శైలి కావడం వల్ల కొన్ని చోట్ల భావుకత మరికొన్ని చోట్ల అచ్చమైన భౌతికత కూడా మేళవించగలిగాడు. -తెలకపల్లి రవి