Sooti Maata

దేవులపల్లి అమర్ / Devulapalli Amar · Books

Sooti Maata book cover

Price: Rs. 270. ఈనాటి కాలమిస్టులలో తెలుగు పత్రికలకు సంబంధించి పూర్వపు ఉమ్మడి, ప్రస్తుత ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయవ్యవహారాలు, పరిణామాలకు వాటి కారకులకు సంబంధించి మంచి అవగాహన ఉన్నవాడు అమర్. గత నాలుగుదశాబ్దాలుగా వివిధ పత్రికలలో పనిచేస్తూ వివిధ సంఘటనా భరితమయిన వార్తలు జిల్లాల నుండి సేకరించి ప్రజల దృష్టికి తీసుకురావడంలో చురుకయిన పాత్ర పోషించిన విలేఖరి, దీర్ఘకాలం ఉమ్మడి రాజధానిలో, ఇప్పటి తెలంగాణా రాజధానిలో ప్రధాన రాజకీయ విలేఖరిగా నడుస్తున్న చరిత్రను శ్రద్ధగా, ఆప్రమత్తంగా పరిశీలిస్తున్న నిశితదృష్టి గలవాడు. కొత్తగా ఏర్పడిన తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ ధోరణులు యధాశక్తి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి ఆ ఫలితాలు పాఠకులకు బట్వాడా చేస్తున్నాడు. తన డేట్లైన్లో భవిష్యత్ తరాల కోసం రికార్డు చేసాడు . a journalist provides raw material for writing current history అని కదా ప్రతీతి. - సి.రాఘవాచారి జన రాజకీయాల కాణాచి అమరక్కు భావజాలం ఉంది. నిర్దిష్టమయిన భావజాలం పత్రికా రచయితకు ఉండడం వల్ల వివిధ అంశాలను సవ్యంగా అర్ధం చేసుకోగలుగుతారు. నిష్పాక్షికత భావజాలానికి ప్రత్యామ్నాయం కాదు. అమరకు ప్రాపంచిక దృక్పధంలోనూ నిబద్ధత ఉంది. తెలంగాణ సాధన విషయంలో నిబద్ధుడయి. ఉన్నాడు. ఆ విషయాన్ని దాచుకోడానికి అడ్డదారులు వెతకలేదు. ఈ రచనలను ఆస్వాదించడానికి అమర్ భావజాలం, ప్రాపంచిక దృక్పధం అడ్డురావు. ఎందుకంటే అమర్ భావజాలం ప్రజాపక్షాన నిలబడేది. జీవనోపాధి కోసం మాత్రమే పత్రికలలో పనిచేసే వారిలో భావజాలం, నిబద్ధత ఉండకపోవొచ్చు. ఉన్నా దానిని దాచిపెట్టడానికి నానా యాతన పడుతుంటారు. ఏ భావజాలం లేదని గొప్పలు చెప్పుకునే వారు పాలకవర్గాల బోయీలుగా మాత్రమే మిగిలిపోతారు. వారి రాతలు కేవలం కిరాయి రాతల కిందే చెత్త బుట్టలో చేరుతాయి. - ఆర్.వీ.రామారావు

Browse more Telugu books