Sootha Puranam-1

బి. రామకృష్ణ / B. RAMAKRISHNA · Stories & Poetry

Sootha Puranam-1 book cover

Price: Rs. 288. కవిరాజు కవి. పండితుడు. సంస్కర్త. హేతువాది. చదువు, జ్ఞానం, విజ్ఞానం ఒక కులం గుత్త హక్కులు కావని వాటిని ఆర్జించే హక్కు ప్రతి ఒక్కరికీ జన్మహక్కనీ చాటిచెప్పిన ఆద్యుల్లో ఒకరు. బ్రాహ్మణేతరుల్లో ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపిన దార్శనికుడు. దక్షిణాదిన బ్రాహ్మణేతర ఉద్యమ తొలి నాయకుల్లో ఒకరు. మూఢనమ్మకాలపైన కత్తులు దూసిన వీరుడు. బౌద్ధిక ప్రపంచాన్ని ఏలుతున్న ఆనాటి పెత్తందార్లను ప్రశ్నించి ఎదిరించిన ఏకవీరుడు. తన భావాలబాటలో తన పయనాన్ని ఒంటరిగా ప్రారంభించి దానిని ఒక ఉద్యమంగా మలిచిన మహానిర్మాత. తెలుగునాట త్రిపురనేని నిర్వహించిన చారిత్రిక పాత్రను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సమాజంపై ఆయన కలిగించిన ప్రభావాన్ని ఎంత కుదించినా అపారంగానే ఉంది. ఇది వచన సూతపురాణం. దీనిని వచనంగా మార్చినవారు నాస్తిక ఉద్యమనేత కీ.శే. బి. రామకృష్ణగారు. రామకృష్ణగారు తన జీవితపర్యంతం తను నమ్మిన ఉద్యమానికి కట్టుబడే ఉన్నారు.

Browse more Telugu books