Sociolinguistic Study of Telugu in Mahabubnagar District

Appam Pandayya / అప్పం పాండయ్య · Literature

Sociolinguistic Study of Telugu in Mahabubnagar District book cover

Price: Rs. 270. ఎన్నో ఊళ్ళు తిరిగి, ఎందరెందరితోనో ముచ్చటించి, ఎన్నో ఏళ్ళుగా దీక్షతో పరిశ్రమించి, ఎన్నో ఊళ్ళు తిరిగి, ఎందరెందరితోనో ముచ్చటించి, ఎన్నో ఏళ్ళుగా దీక్షతో పరిశ్రమించి, ఎన్నెన్నోపటాలతో పట్టికలతో విశ్లేషించి, వింగడించి గణాంకాలతో శాతాలతో నిష్కర్షగా నిగ్గు తేల్చి 'పాలమూరు పలుకుబడి'కి కులం, వర్గం, వృత్తి, విద్య అనే నాలుగు అంచులతో పటం కట్టిన పరిశోధన గ్రంథం ఇది. సామాజిక భాషాశాస్త్ర దృష్టితో 'పాలమూరు పలుకుబడి' మీద ఆయన చేసిన ప్రతిపాదనలు భాషాశాస్త్రజ్ఞులకేకాక, మావంటి భాషాభిమానులకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. - ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి. ఒక సామాజిక భాషాశాస్త్రవేత్తగా డా॥ అప్పం పాండయ్య రచించిన "మహబూబ్నగర్ జిల్లా తెలుగు: సామాజిక భాషాశాస్త్ర పరిశీలన" అనే సైద్ధాంతిక గ్రంథం తెలుగులోనే కాక మొత్తం భారతీయ భాషలలోనే సామాజిక మాండలిక భాషా వ్యవహారంపై వచ్చిన మొదటి విపుల పరిశోధన గ్రంథంగా చెప్పుకోవాలి. ఈ పరిశోధనలో వ్యవహర్తల కులం, వర్గం, వృత్తి, విద్య అనే నాలుగు సామాజిక అంశాలు ఆయా వ్యవహర్తల మాండలికత లేదా ప్రామాణికతల స్థితిగతులపై చూపించే ప్రభావాన్ని పసిగట్టి నిరూపించడం ప్రధాన ఇతివృత్తం. ఈ ప్రక్రియలో కృతకృత్యులయ్యారు అనడంలో సందేహంలేదు. - ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు. నాకు తెలిసినంతవరకు ఒక ప్రాంతం తెలుగును సామాజిక భాషాశాస్త్ర సిద్ధాంతాలను, విధానాలను అన్ని కోణాలనుంచి అన్వయించి పరిశీలించిన మొదటి సిద్ధాంతవ్యాసం ప్రస్తుతం ముద్రణరూపంలో మన ముందుకు వస్తున్న "మహబూబ్నగర్ జిల్లా తెలుగు - సామాజిక భాషాశాస్త్ర పరిశీలన", పరిశోధకుడు, మిత్రుడు అప్పం పాండయ్య సామాజిక భాషాశాస్త్ర సిద్ధాంతాలను జీర్ణించుకొని నిర్దిష్ట విధానాలను రూపొందించుకొని శ్రమకోర్చి చేసిన పరిశోధన ఇది. మహబూబ్నగర్ జిల్లాలోని సామాజిక భాషా వ్యవహారస్థితిలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, సామాజిక, భాషావ్యవహార సమ్మేళనాలకు ప్రాతినిథ్యం ఇస్తూ సూక్ష్మస్థాయి పరిశీలన చేయడం ఎంతో ఓపికతో, నిజాయితీతో జరగవలసిన పని. దీనికి తోడుగా భాషాశాస్త్ర పరిజ్ఞానం, నిర్దిష్ట ప్రణాళిక, అనుభవం

Browse more Telugu books