Socialisiam-Charcheelu
Editor · Politics

Price: Rs. 15. ప్రఖ్యాత అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకురాలు రోజా లగ్జంబర్గ్ క్రైస్తవమతం పుట్టుక గురించి, దాని తదనంతర పరిణామాల గురించి విశ్లేషించిన అమూల్యమైన చిన్న పుస్తకం ఇది. క్రైస్తవ మతం ఆవిర్భవించిన రాజకీయ, సామాజిక, చారిత్రక పరిస్థితులను తొలుత వివరించిన లగ్జంబర్గ్, పేదలను ఉద్ధరించాలన్న దాని తొలినాటి ఆశయాలను స్పష్టం చేస్తారు. ఆ తర్వాత ఆ ఆశయాలకు పూర్తి విరుద్ధంగా అదే పేదలను, కష్టజీవులను దోపిడీ చేస్తున్న పాలకవర్గాల కొమ్ముకాస్తూ, కష్టజీవుల ఉద్యమాలను తీవ్రంగా ద్వేషించేదిగా ఎలా తయారయింది. దానికి కారణాలేమిటి అన్న అంశాలను ఎంతో సమర్థవంతంగా పాఠకుల ముందుంచుతారు. ఇదే సమయంలో కార్మికవర్గ పార్టీ మతం పట్ల, అశేష ప్రజల మత విశ్వాసాలపట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలో కూడ తెలియచేస్తారు.