Social Perspectives

Editor · New Arrivals

Social Perspectives book cover

Price: Rs. 245. Social Perspectives by Dr. Neelam Sampath, Collection of Articles on Social, Political and Economic Issues. డా. సంపత్ రాజకీయ ఆలోచనా విధానం స్పష్టంగా, వస్తునిష్ఠంగా, సహేతుకంగా ఉంటుంది. వ్యక్తీకరణ సూటిగా, మర్యాదగా, నిర్మొహమాటంగా ఉంటుంది. వర్తమాన రాజకీయ పరిస్థితిపైన రచయిత అభిప్రాయాలు స్వాగతించదగినవి, -డా. కె. రామచంద్రమూర్తి భారతీయ సమాజంలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో వస్తున్న, వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడంలో, అన్ని పరిణామాల మీద ఒక అవగాహన కల్పించే విధంగా డా. సంపత్ వ్యాసాలు ఉన్నాయి. సమాజం విచ్ఛిన్నమై వ్యక్తి కేంద్రక ప్రపంచాలు ఏర్పడుతున్న కాలంలో సామాజిక చింతనాపరుడైన సంపత్ వ్యక్తిని సామాజికుడిగా మార్చడానికి చేసిన ప్రయత్నమే 'సోషల్ పర్ స్పెక్టివ్స్'. -అల్లం నారాయణ ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను కూలంకషంగా విశ్లేషిస్తూ, వాటిని పరిష్కరించడం ద్వారానే ఆదర్శ సమాజం నిర్మించబడుతుందనే నమ్మకంతో డాక్టర్ నీలం సంపత్ చేస్తున్న వ్యాసరచన ఆశించిన ఫలితాలను అందిస్తుందని భావిస్తున్నాను. -సారంపల్లి మల్లారెడ్డి అనేక అపసవ్యతలను విలక్షణమైన వ్యాసాలుగా మలిచారు డా.నీలం సంపత్ గారు. సరైన డేటానే కాకుండా సరైన దిశగా ఆలోచించడం వల్ల ఈ వ్యాసాలు ఇప్పటి కాలానికి అవసరమైనవి. ముఖ్యంగా యువతకి దిశానిర్దేశం చేయగలిగేవి. – డా. ఏనుగు నరసింహారెడ్డి రచనల్లోని ప్రతి అక్షరం డా. సంపత్ నిశిత పరిశీలనా దృష్టికి అద్దం పడుతుంది. చదవడమే కాదు, గ్రామాలకు వెళ్లి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకొంటూ, వారి జీవన విధానాలను అధ్యయనం చేస్తూ తన కలానికి మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు సంపత్. ఇటువంటి అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పడానికి కలంలో ఉండాల్సింది ఇంక్ కాదు. ధైర్యం. -ఎ.వి.వి ప్రసాద్

Browse more Telugu books