Sinduram, Luddig FoyerBhak Sampradhaya Jarman Thatvashsra Parisamapti

Editor · Politics

Sinduram, Luddig FoyerBhak Sampradhaya Jarman Thatvashsra Parisamapti book cover

Price: Rs. 126. బతుకులేని మెతుకులేని బక్క జీవిని పనికిపెట్టి ఒక్క తీరుగ లెక్కజెప్పని పనిగంటలు పెంచుకుంటూ పగలు రేయి వేళగాంచక 'కని' పెంచిన వస్తు జాలం మెరుగు మెరుపుతో ఉరుకు పరుగుతో మహా వేగపు అమ్మకాలతో పెరిగిన తొలి పెట్టుబడులు వాస్తవంలో ఒక్క భాగం. భూ జాతను కొల్లగొట్టి సముద్రపోడలు దోచుకొచ్చి సమస్త ఆస్తులు పెళ్ళగించి అరగదీసి కరగదీసి కమ్మించిన పెట్టుబడితో అల్లుకున్న నాటి కోటలే కొత్త సమాజ వ్యవస్థ రూపం కనీసం ఆధునిక చరిత్రకు సంబంధించినంత వరకు చూసినా, రాజకీయ పోరాటాలన్నీ వర్గపోరాటాలేననీ, విముక్తి కోసం జరిగే అన్ని వర్గ పోరాటాలూ చిట్టచివరకు ఆర్థిక విమోచన కొరకే ఉద్దేశించబడ్డాయనీ నిరూపితమైంది. ప్రతి వర్గ పోరాటమూ రాజకీయ పోరాటమే కనుక, ఈ పోరాటాలన్నీ అనివార్యంగా రాజకీయ రూపాన్ని ధరించి తీరతాయి. కనుక, కనీసం ఈ రంగానికి సంబంధించినంత వరకు, రాజ్యం - రాజకీయ వ్యవస్థ- ద్వితీయ స్థానంలోనూ, ఆర్థిక సంబంధాలకు చెందిన పౌరసమాజం - నిర్ణయాత్మక స్థానంలోనూ వుంది. హేగెల్ కూడా ఆమోదించబడిన ఈ సంప్రదాయ అభిప్రాయం ప్రకారం రాజ్యమే నిర్ణాయక శక్తియనీ, పౌర సమాజం దానిచేత నిర్ణయింపబడే శక్తి అనీ భావించాడు. పైకిచూస్తే అలాగే కనిపిస్తుంది. ఒక వ్యక్తి చర్యలకు కారణభూతమైన చోదక శక్తులన్నీ అతని మెదడులో మొదట ప్రవేశించాలి. లక్ష్యాలుగా పరివర్తన చెందాలి. అప్పుడే అవి కార్యాచరణకు అతనిని ప్రేరేపించగలవు. అదే విధంగా, పౌర జీవితంయొక్క అన్ని అవసరాలూ, పరిపాలక వర్గం, ఏవర్గమైనప్పటికీ రాజ్యం యొక్క అభీష్టంలోకి ప్రవేశించాలి. తరువాతనే అవి చట్టాలుగా సాధారణ ధ్రువీకరణ పొందగలవు. ఇది పైకికనిపించే అంశం. దీనిని తేలికగానే గ్రహించవచ్చు. అయితే అసలు ప్రశ్న ఏమంటే, లాంఛనప్రాయమైన ఈ అభీష్టం యొక్క -వ్యక్తి యొక్క, ప్రభుత్వం యొక్క- అభీష్టంలోని సారాంశం ఏమిటి, ఈ సారాంశం ఎక్కడ నుండి ఆవిర్భవిస్తున్నది. కేవలం ఈ అభీష్టమే ఎందుకు కలిగింది? మరొకటి ఎందుకు కలగలేదు? ఈ అంశాన్ని మనం పరిశోధించినట్లయితే, ఆధునిక చరిత్రలో రాజ్యం యొక్క అభీష్టం, మొత్తం మీద పౌరసమాజం యొక్క మారుతున్న అవసరాల దృష్ట్యా నిర్ణయమవ

Browse more Telugu books