Sinare kavithvaanusheelam (సినారె కవిత్వానుశీలనం )
Editor · Novels

Price: Rs. 75. ఆరున్నర దశాబ్దాల కవిత్వ జీవితం గల కవి మీద నా నాలుగు దశాబ్దాల సాహిత్య విమర్శ జీవితం లో నేను రాసిన విమర్శ ఇంతే. ఈ రాయడం ఒక రాయడమే కాదనిపించింది.ఈ అసంతృప్తి లోంచే "సినారే కవిత్వానుశీలనం " ( డా || సి. నారాయణరెడ్డి గారి కవిత్వ పరామర్శ ) అనే గ్రంథం పుట్టుకొచ్చింది. ఈ వ్యాసాలన్నీ గత నాలుగు నెలల్లో రాసినవే. ఈ వ్యాసాలను సి. నారాయణరెడ్డి గారి 29న విభిన్న పత్రికలలో ప్రచురిద్దామని భావించాను. మే నెల 26న దేశం ముందడుగు వేయాలి " అనే కవిత్వ రచనా నేపథ్యం గురించి కనుక్కుందామని సి. నారాయణరెడ్డి గారికి ఫోన్ చేశాను. వారి కుమార్తె గంగ గారు మాట్లాడించారు. అప్పుడు అయన తనకేమీ గుర్తులేవని బలహీనంగా మాట్లాడారు. అప్పుడే నాకు భాధ కలిగింది. అయినా అయన ఇంత త్వరగా కన్నుమూస్తారని అనుకోలేదు. 12.06. 2017 ఉదయాన్నే వారు కన్నుమూశారు. అభ్యుదయ గొంతు మూగబోయింది. వారు మరణించాక మరికొన్ని వ్యాసాలు రాశాను.