SIMHANIKI JALUBU CHESINDI (Balala- chitti- chinni kadhalu)

Editor · Best Selling

SIMHANIKI JALUBU CHESINDI (Balala- chitti- chinni kadhalu) book cover

Price: Rs. 190. వీరి పూర్తి పేరు కొక్కెరగడ్డ వేంకట లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా నందు, పి.గన్నవరం మండలంలోని మానేపల్లి గ్రామంలో శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ కామశాస్త్రి దంపతులకు జన్మించారు. 2002 నుండి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. కె.వి. లక్ష్మణరావు కలం పట్టిన రోజుల్లో చందమామ పత్రిక రావడం పూర్తిగా ఆగిపోయింది. మొదటి బాలల కథ "సుబుద్ధి సమయ స్ఫూర్తి" బాలభారతం (ఈనాడు వారిది) లో 2014 ఆగస్ట్ నెల ప్రచురితమైంది. ఇప్పటివరకూ 200కు పైగా బాలల కథలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథల్ని బాలల నీతికథలు, జ్ఞానోదయం, అంతా ఒక్కటే కథా సంపుటాలుగా ప్రచురించారు. 2018 విశాఖ సంస్కృతి మాసపత్రిక వారు నిర్వహించిన బాలల కథల పోటీలో వీరు రాసిన "చిగురించిన స్నేహం" కథకు ప్రథమ బహుమతి వచ్చింది. 2019లో ఇదే పత్రిక వారు నిర్వహించిన బాలల కథల పోటీలో “ఒక్కసారి ఆలోచించండి" కథకు తృతీయ బహుమతి వచ్చింది. 2020 లో వారు నిర్వహించిన బాలల కథల పోటీలో "స్నేహ బంధం" కథకు ప్రత్యేక బహుమతి వచ్చింది. 2013 జనవరిలో విపుల మాస పత్రికలో ప్రచురితమైన బాలల పోస్ట్ కార్డు కథ "ఏపేరుతో పిలిచినా” కథను చదివి కొంచెం పెద్దది చేసి దేవాలయాల నేపధ్యంలో షార్ట్ ఫిల్మ్ తీశారు ప్రముఖ రచయిత, సినీ నటులైన L.B. శ్రీరామ్. అది వీరికి ఎంతో తృప్తి, ఆనందాన్ని కలిగించింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బాల సాహిత్య కథలు చదవడం, సమీక్ష చేయడం వీరికి బాగా ఇష్టం.

Browse more Telugu books