Shoban Babu Jeevitha Charithra
Editor · History

Price: Rs. 225. ఏ పనైనా ఎక్కడ మొదలెట్టాలో.. విజయం సాధించడానికి ఏంచెయ్యాలో మనందరికీ తెలుసు. కానీ, ఎక్కడ ఆపితే ఆ విజయాన్ని ఆస్వాదించగలమో ఎంత మందికి తెలుసు? నిజానికి అది తెలియడమే విజయ రహస్యం! డబ్బు, పేరు.. ఏదైనా సరే - అన్నిటికీ ఒక స్థాయి తర్వాత 'ఇక చాలు..' అని చెప్పడమే అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్. అదే ప్రశాంతతకు చిరునామా! అలా చెప్పగలగడమే అసలైన వ్యక్తిత్వం!! ఇదే సిసలైన జీవిత సూత్రం. ఈ జీవిత సారాన్ని ఆకళింపు చేసుకున్న సోగ్గాడి జీవనయానాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించటమే ఈ ప్రయత్నం. శోభన్ నట, నిజజీవితాలకు సంబంధించిన అనేకానేక సంఘటనల సమాహారం ఈ పుస్తకం. మీడియాకు ఆమడ దూరంలో ఉండే శోభన్‌బాబు వ్యక్తిగత జీవిత అంశాలనెన్నింటినో వివరిస్తున్న తొలి తెలుగు పుస్తకమిది.