Shikhandi

Vemana Vasanthalakshmi / వేమన వసంతలక్ష్మి · Stories & Poetry

Shikhandi book cover

Price: Rs. 157. క్వియర్ తనమనేది ఆధునికమో, పాశ్చాత్యమో, లైంగికమో మాత్రమే కాదంటారు దేవదత్ పట్నాయక్. దానికి విస్తృతమైన అర్ధం ఉందంటారు ఆయన. హిందూమతానికి చెందిన లిఖిత, మౌఖిక కథలను జాగ్రత్తగా పరిశీలిస్తే శిఖండి వంటి కథలెన్నో కనిపిస్తాయంటారు. శిఖండి ఎవరు? భీష్ముడి మీద పగబట్టిన అంబ మాత్రమే కాదు; భార్యను సంతృప్తి పరచడానికి పురుషుడిగా మారిన స్త్రీ కూడా. మాంధాత ఎవరు? తల్లి లేకుండా తండ్రికి పుట్టినవాడు. భగీరథుడు ఎవరు? ఇద్దరు తల్లులకు పుట్టినవాడు. స్కంధుడు ఎవరు? అనేక తల్లులకు పుట్టినవాడు. అలాగే బుద్ధుడు, కృష్ణుడు భంగిమలలో కనిపించే స్త్రీత్వ లక్షణాలు దేనికి సూచిక? పురుషుడంటేనే తెలియని ప్రమీల, స్త్రీ అంటేనే తెలియని ఋష్యశృంగుడు, అర్ధనారీశ్వరుడైన శివుడు... ఇలాంటి కథలన్నీ ఏం చెపుతున్నాయి? వేల సంవత్సరాల నుండి వీటిని వింటూ చదువుతూ కూడా క్వియర్నం భారత సంప్రదాయంలో లేదని ఎలా అనగలం? ఎన్నాళ్ళు అధిభౌతిక, మార్మికతల వెనక దాక్కుంటాం అని ప్రశ్నిస్తున్నాడు రచయిత.

Browse more Telugu books