Shathakamulu
Editor · Novels

Price: Rs. 160. ఆ అంతరంగమందు । నపరాధములు చేసి మంచి వాని వలెనె | మనుజుఁడుండు ఇతరు లెఱుగ కున్న | నీశ్వరుఁ డెఱుగఁడా? విశ్వదాభిరామ । వినురవేమ. టీ. విశ్వదాభిరామ (విశ్వద+అభిరామ) = సమస్తమును ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాఁడా! వేమ = ఓ వేమా! వినుర = వినుము. అంతరంగమందు . (అంతరంగము+అందు) = మనసునందు, అపరాధములు చేసి = తప్పులు చేసి, మంచి వాని వలెనె (వలెను+ఎ) = మంచివ్యక్తి వలె, మనుజుఁడుండు (మనుజుఁ డు+ఉండు) = మనుష్యుఁడున్న, ఇతరులెరుగకున్న (ఇతరులు+ఎఱుగక+ఉన్న)= ఇతరులకు తెలియకపోయినా, ఈశ్వరుఁడు ఎఱుగఁడా (ఎఱుగఁడు+ఆ) = ఈశ్వరునికి తెలియదా. తా. ఓ వేమా! మనుష్యుడు తన మనస్సులో ఎన్నో తప్పులు చేసి, పైకి మంచివాని వలె కనిపించు చుండును. ఇది ఇతరులకు తెలియకపోయినా, సర్వాంతర్యామియైన భగవంతునికి తెలియదా? (తెలియును)