Shanthi Charchalu Prajaswamyam Viplavodyamam

Editor · Politics

Shanthi Charchalu Prajaswamyam Viplavodyamam book cover

Price: Rs. 90. వాదవివాదాలలోనే, అనేక వాదనల గందరగోళం మధ్యనే అద్భుతమైన వాదనలు ఆవిర్భవించాయి. సోక్రటీస్ వాదనల నుంచి మార్క్స్ వాదనల దాకా చరిత్రకు ఎక్కినది అందువల్లనే. హెగెల్, ఫ్యూర్ బా, స్టీర్నర్, బావర్, ప్రౌధాన్, డ్యూరింగ్, ఆడమ్ స్మిత్, రికార్డో, మాల్టస్, లాసాల్, బకూనిన్ వంటి ఎందరో భావవాదులతో, యాంత్రిక భౌతికవాదులతో, ఉదారవాదులతో, యథాస్థితి సమర్థకులతో, ఊహాజనిత సోషలిస్టులతో, అరాచకవాదులతో సంభాషణా క్రమంలో మార్క్స్ అటువంటి వాదనలను అభివృద్ధి చేశాడు. ఆ వాదనలను అటు సిద్ధాంతంలోనూ ఇటు ఆచరణలో కూడా అన్వయించి మరింత పరిపుష్టం చేసినవారు పారిస్ కమ్యూన్ కమ్యూనార్డులు, లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్కులు, మావో నాయకత్వంలో చైనా కమ్యూనిస్టులు, ప్రపంచ విప్లవాలన్నిటిలో ఎందరో ఆలోచనాచారణ వాదులు. ఇతర భాషల మేధా సంప్రదాయంలో పాలిమిక్స్ అని పిలిచే ఈ అత్యవసరమైన సంభాషణా పద్దతి తెలుగులో ఒకప్పుడు ఉండినప్పటికీ, ఇటీవలికాలంలో విచారకరంగా చాలా తగ్గిపోయింది. భిన్న వాదనల మధ్య సంభాషణా, చర్చా క్రమంలోనే సరైన వాదనలు నిగ్గు తేలుతాయనే నిరూపిత సత్యాన్ని విస్మరించి, నొప్పింపక తానొవ్వక తమ భావాలు మాత్రం తాము చెప్పుకుని, తాము మెచ్చే భావాలు మాత్రమే చదువుతూ, వింటూ, చర్చా సంప్రదాయాన్ని మరిచిపోయిన తరం తెలుగు మేధా లోకంలోకి వచ్చింది. వాస్తవంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, చర్చించి నిగ్గు తేల్చకుండా తప్పుకుపోయే ధోరణి పెరిగింది. ఈ పుస్తకం మళ్లీ ఒకసారి పాలిమిక్స్ ను రంగం మీదికి తెస్తున్నది

Browse more Telugu books