Shame..Shame.. Puppy Shame!
Editor · Books

Price: Rs. 135. "అంటే పతివ్రతలయందు కమ్యూనిస్ట్ పతివ్రతలు మేలయా అంటావ్" అందామె. "ఎప్పుడూ గర్ల్స్ పైనే ఎందుకు అటాక్ జరగాలి. గర్ల్స్ కూడా బాయ్స్ ని రేప్ చేయొచ్చుగా..” అంది పాప. నడక అలవాటైపోయిన తరువాత నడవడం అనేదాన్ని ప్రత్యేకంగా గుర్తించనట్టే.. పరుగు పందెంలో కాలం తెలియకుండా గడిచిపోయింది. కొన్ని ఆలోచనలు మనసులోకి చొరబడ కూడదు. ఒకసారి చొరబడ్డాయా, అవి చెదలా నెమ్మదిగా నొప్పి తెలియకుండా మనిషిని తినేస్తుంటాయి. ఏ చెట్టు కిందైనా తడవకుండా నిలబడొచ్చేమోగానీ, ఆ లైబ్రరీ గదిలో తడవకుండా నిలబడటం సహదేవుడికి కూడా సాధ్యం కాదు. నుదుటన ఎర్రెర్రని కుంకుమ బొట్లు, రెండు కళ్లనిండా ఇంతేసి కాటుకతో.. మూర్తీభవించిన భారతీయతతో వారు విజయదరహాసాలు చిందించారు.