Shabdarathnakarmu
Editor · Books

Price: Rs. 675. బహుజనపల్లి సీతారామాచార్యులు (1827-1891) నాగపట్టణంలో జన్మించారు. చెన్నపట్టణంలోని రాజధాని కళాశాలలో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశారు. సౌందర్యరాజస్వామి శతకం, వైకృతదీపిక, పదార్ధనామకోశం, లఘుకౌముది, ఆంధ్రశబ్దమంజరి, ఉపాధ్యాయబోధిని వంటి పలుగ్రంథాలు రచించారు. బహుజనపల్లి వారి రచనల్లో చిరస్థాయిగా నిలిచిపోయినవి త్రిలింగ లక్షణశేషము అనే ప్రౌఢవ్యాకరణము, శబ్దరత్నాకరము అనే ఈ ప్రామాణిక నిఘంటువు. తెలుగు కావ్యభాషను అర్థం చేసుకోవడంలో చక్కగా ఉపయోగపడడం తోపాటు, ఆయాకవుల ప్రయోగాలను కూడా ఇచ్చిన ఈ నిఘంటువు చాలా ఉపయోగకరమైనది. 104 గ్రంథాల నుండి ప్రయోగాలు చూపిన బహుజనపల్లి వారి పాండిత్యం శ్లాఘనీయం. గత నూరేళ్లలో భాషలో ఎన్నో కొత్త పదాలు వచ్చి చేరాయి. ఈ నిఘంటువులో అటువంటి సుమారు 5000 పదాలను చేర్చడం జరిగింది. నిఘంటువును ఉపయోగించే నేటి వ్యవహర్తలందరికీ ఇదెంతో ప్రయోజనకారి.