Selfie Naa Life Story

P.V.V. Prasada Rao / పి.వి.వి. ప్రసాదరావు · Biographies & Auto Biographies

Selfie Naa Life Story book cover

Price: Rs. 450. సెల్ఫీ నా లైఫ్ స్టోరీ వి.వి.ప్రసాదరావు మనువాదులు, భూస్వాములు కలిసికట్టుగా పెంచి పోషించిన సామాజిక దురాచారాల మీద, మూఢనమ్మకాల మీద ప్రసాదరావు గారు చేస్తూ వచ్చిన పోరాటం గొప్పది. అందుకు సహృదయం, సంస్కారం, నిజాయితీ, నిబద్ధతా, కార్య నిర్వహణా దక్షత, ఆర్థిక వనరుల కూర్పు, ఇతరులను కలుపుకు పోవడం వంటి ఎన్నో గుణాలు ఉంటే గాని ఒక ప్రసాదరావు తయారు కాలేరు. ఉపాధ్యాయుడుగా ఒకవైపు విద్యనందిస్తూ, మరోవైపు మూఢనమ్మకాల నడ్డి విరగ్గొట్టి సమాజ చైతన్యానికి దోహదం చేయడం అందరి వల్లా కాదు. బలమైన సంకల్పం ఉన్న వి.వి.ప్రసాదరావు గారి వంటి వారికి మాత్రమే అది సాధ్యం! కొందరు ఉపాధ్యాయులు క్లాసులో మాత్రమే పాఠాలు చెపుతారు. ప్రసాదరావు లాంటి వారు మొత్తం సమాజానికి చెప్పేది - ప్రాయోగికంగా చేసి చూపెడతారు! - దేవరాజు మహారాజు తీసుకున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయటం ప్రసాదు ప్రత్యేకత. అలాగే తను ఉపాధ్యాయుడిగా పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ, విద్యార్థులకు పాఠాలు చెప్పటమేకాక, వారిలోని సృజనాత్మకత తట్టిలేపటంలోనూ, ప్రశ్నించే గుణాన్ని పెంపొందించటంలోనూ, సామాజిక స్పృహ కల్గించడంలోనూ శ్రద్ధ వహించేవారు. ఆయా గ్రామాలలో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయదృక్పథం నెలకొల్పటానికి ప్రయత్నించేవారు. ఆడపిల్లల చదువు. భవిష్యత్తును గురించి ప్రసాద్ బాగా తపన పడేవారు. తన శ్రీమతి నిర్మల బాలికల హాస్టలు వార్డెను కావటం వలన ఏర్పడిన పరిచయాలతో, పేద బాలికలకు పై చదువులకు వెళ్ళేందుకై కావల్సిన కెరీర్ గైడెన్స్ ఇవ్వటమే కాకుండా వారి తల్లిదండ్రులతో చర్చించి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేవారు. వారి వివాహాలలో కూడా అవసరమైన కౌన్సిలింగ్ చేసేవారు. అలా చదువుకున్న అమ్మాయిలు, నర్సులుగానూ, టీచర్లుగానూ, ఆఫీసర్లుగానూ, వివిధ ఉద్యోగాలలో ఉంటూ వీరిని గుర్తుచేసుకుంటూ, వివిధ సందర్భాలలో కలుసుకుంటూ వుండటం చూస్తే ఆనందం కలుగుతుంది. - డా|| జయనీ నెహ్రూ • డా॥ రామ్మోహనరావు మన పితృస్వామ్య వ్యవస్థలో ఆడపని, మగపని అని విడదీసి, ఎవరేది చేయాలో, ఎలా చేయాలో నిర్దేశిస్తారు. ముఖ్యంగా ఇంట్లో మగవాళ్ళు ఇంట

Browse more Telugu books