SEETHARAM ECHURI O SOCIALIST ACHARANA PADHAM

Editor · Politics

SEETHARAM ECHURI O SOCIALIST ACHARANA PADHAM book cover

Price: Rs. 180. గొప్ప మార్క్సిస్టు విశ్లేషకుడు, ఆచరణ శీలి, భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈ ప్రచురణను నవతెలంగాణ, ప్రజాశక్తి సంయుక్తంగా తీసుకువస్తున్నాయి. ఇప్పటివరకు ప్రచురించని వ్యాసాలతో ఈ సంకలనం మీ ముందుకు వస్తున్నది. వర్తమానంలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ యావత్తూ తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తోంది. నయా ఉదారవాద విధానాలతోటే అభివృద్ధి అంటూ ఇంతరవకూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ విధానాల పర్యవసానంగానే వచ్చిపడ్డ సంక్షోభం నుండి బైటపడే దారి తోచక కార్పొరేట్ ప్రభుత్వాలన్నీ నానా అగచాట్లూ పడుతున్నాయి, ప్రజలను అగచాట్లపాలు చేస్తున్నాయి. ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థను అధిగమించి కొత్త, సోషలిస్టు వ్యవస్థను నిర్మించుకోవడమే ప్రపంచంలోని అత్యధిక ప్రజానీకానికి అసలైన పరిష్కారాన్ని చూపగలుగుతుంది. ఈ నూతన సమాజాన్ని నిర్మించుకోడానికి కావలసిన సైద్ధాంతిక ప్రాతిపదిక మార్క్సిజంలో మాత్రమే ఎలా ఉందో, నేటి ప్రపంచంలో ఆ మార్క్సిజాన్ని ఎలా ఆచరణకు అన్వయించాలో ఈ వ్యాసాలలో సీతారాం ఏచూరి చాలా ప్రతిభావంతంగా, తనదైన విశ్లేషణాత్మక శైలిలో వివరించారు. సమాజం అభ్యుదయ మార్గాన ముందుకు పోవాలని అభిలషించే ప్రతీ ఒక్కరు తప్పక చదవవలసిన పుస్తం ఇది.

Browse more Telugu books