Science-Charithraka Parinamam

Editor · Education & Science

Science-Charithraka Parinamam book cover

Price: Rs. 90. చరిత్ర గమనంలో చాలాకాలం మనిషి బతకడానికి చేసుకునే పనుల్లో, చర్యల్లో ఊహాగానాల్లో, వృత్తుల్లో సైన్సు కలగలిసిపోయిందని, దానికి ప్రత్యేక స్థానం రావడానికి చాలా కాలమే పట్టిందని ప్రఖ్యాత శాస్త్రవేత్త, 'సైన్స్ ఇన్ హిస్టరీ' గ్రంథ రచయిత జె డి బెర్నాల్ అంటాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఒక 300 సంవత్సరాలుగా మాత్రమే సొంత కాళ్ళపై నిలబడి, స్వతంత్రంగా ఉందని అంటాడు. ఆధునిక సైన్సు ఒక వ్యవస్థ అని, ఒక పద్ధతి అని, సమీకృతమైన విజ్ఞానం అని, ఒక ముఖ్యమైన ఉత్పత్తి శక్తి అని, ఆలోచనలను నమ్మకాలను మలిచే ప్రబల శక్తి అనే బెర్నాల్ అంటాడు. అయితే ఆధునిక సైన్సును, ఒక విశాలమైన నిర్వచనంలోకి తేవాలంటే, అది ఇలా ఉండొచ్చు. "రుజువులను ఆధారంగా చేసుకున్న సువ్యవస్థిత పద్ధతుల ద్వారా విజ్ఞానాన్ని అన్వేషించడానికి, ఆచరణలో అనువర్తింప చేయటానికి, ప్రకృతిని సమాజాన్ని అర్థం చేసుకోవడానికీ చేసే కృషిని సైన్స్ అనొచ్చు.”

Browse more Telugu books