SC ST Nidhulu Vidilimpu – Mallimpu
బొజ్జా తారకం / Bojja Tharakam · Caste, Religion & Culture

Price: Rs. 45. మొదటి ముద్రణ ప్రతులు ఎప్పుడో అయిపోయాయి. రెండో ముద్రణ తీసుకు రావాలని పాఠకులు చాలామంది కోరుతున్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఖర్చుకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో ఉండటంవల్ల దీని అవసరం ప్రతీ ఏడూ ఉంటుంది. ఎస్.సి, ఎస్.టి. నిధుల వినియోగం గురించి ఆలోచిస్తున్నవారు ఎక్కువవుతూ ఉన్నారు కాబట్టి ఈ పుస్తకం అవసరం రోజు రోజుకూ ఎక్కువవుతుంటుంది. చాలా తొందరగానే మొదటి ముద్రణ ప్రతులు అయిపోయాయి. ఈ పుస్తకం మొదటి ముద్రణ తరువాత ఎస్.సి., ఎస్.టి. నిధుల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అదేదో అద్భుతమైన చట్టమని, విప్లవాత్మకమైన చట్టమని ప్రభుత్వం బాకా మోగించింది. ఆ విషయాన్ని కూడా ఈ పుస్తకం చివర కొనసాగింపుగా అందించాను. దీని దృష్ట్యా ఈ పుస్తకానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కార్యకర్తలకు ఒక కరదీపికగా ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. కేవలం కరదీపిక గానే కాకుండా పోరాటానికి ఒక అస్త్రంలా కూడా పనికివస్తుందని కూడా అనుకున్నాను. ఈ పుస్తకాన్ని ఆ విధంగా ఉపయోగించవచ్చు. ఈ పుస్తకాన్ని కేవలం చదివి ఊరుకునే కంటే దాంట్లో చెప్పిన మాటలను పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎస్.సి. ఎస్.టి.లకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం తేవటంలో నా ప్రయత్నాన్ని ప్రోత్సహించినందుకు పాఠకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.