SAVITRI BAI PHULE
B.M. Leelakumari and Durgam Subbarao / BM లీలాకుమారి మరియు దుర్గం సుబ్బారావు · Biographies & Auto Biographies

Price: Rs. 55. భారత ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా జరిపిస్తున్నారు. కాని నిజానికి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఈ దేశ ఉపాధ్యాయ దినంగా పాటించాల్సిన అవసరముంది. - ప్రొ॥ కంచె ఐలయ్య అణచివేతకు గురైన అశేష ప్రజానీకంలో అనేక ఆణిముత్యాలు వున్నాయి. అందులో సావిత్రిబాయి పూలే అగ్రగామిగా నిలుస్తున్నది. నాగటి నారాయణ, జాతీయ ఉపాధ్యక్షులు (ఎస్.టి.ఎఫ్.ఐ) ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. మహిళా ఉపాధ్యాయులకు, మహిళాభివృద్ధిని కోరుకునే ప్రతి అభ్యుదయవాదికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మోతుకూరి సంయుక్త బి.ఎం. లీలాకుమారి, రచయిత్రి, ఉద్యమ నాయకురాలు, న్యాయవాది, మహిళలు, దళిత మహిళా సమస్యలపై 1995 బీజింగ్ కాన్ఫరెన్స్లో 'దళిత వుమెన్' పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి, దళిత మహిళల సమస్యలను అంతర్జాతీయంగా తెలియజేశారు. 2001 డర్బన్ సదస్సులో లీలాకుమారి సంకలనం చేసిన 'ఇండియన్ ఆర్యనిజం' పుస్తకాన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ హైకమిషనర్ మేరీ రాబిన్సన్ ఆవిష్కరించారు. దుర్గం సుబ్బారావు రచయిత, సామాజిక కార్యకర్త, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యపై అనేక వ్యాసాలు రచించారు. విద్యార్థి విశ్లేషణ, దళిత బహుజన పరివర్తన, మహాజనం, బహుజన కెరటాలు పత్రికలకు సంపాదకులుగా పనిచేస్తున్నారు. పూలే - పెరియార్ అంబేడ్కరిజంపై పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించారు.