Savallatho Sangarshana ( Smarakopanyasalu Konni Pradhanopanyasalu)
Editor · Politics

Price: Rs. 90. ఇది రెండు దశాబ్దాల కాలంలో పలు సందర్భాలలో చేసిన ప్రసంగాల సంకలనం. బోనపార్టిజం, కులము, వర్గము, భాష, మతోన్మాదము, విముక్తి మతవాదము, ఆర్థిక సంక్షోభం-లాంటి పలురకాల ఇతివృత్తాలపై ఈ ప్రసంగాలు సాగాయి. ఆ విధంగా ఇది విభిన్న అంశాల మేలికలయిక. అయినప్పటికీ వీటన్నింటిలోను ఒక ఉమ్మడి అంశం ఉంది. భారత దేశంలో లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్్ను పటిష్టం చేసుకోవడం, సోషలిజం స్థాపన లక్ష్యంగా జనతా ప్రజాతంత్ర విప్లవానికి దారితీసే ప్రజాపోరాటాలను ముందుకు తీసుకుపోవడం-ఈ ఉమ్మడి అంశం . సీతారాం ఏచూరి, పార్లమెంటు సభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పోలిట్బ్యూరో సభ్యులు, జవహర్ లాల్ యూనివర్శిటీ, న్యూఢిల్లీ నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆలిండియా అధ్యక్షులుగా పనిచేశారు. పలు అంశాలపై ఆయన పుస్తకాలు రచించారు. 'హిందూజాతి' అంటే ఏమిటి?, '21వ శతాబ్దంలో సోషలిజం', 'మతోన్మాదం- లౌకికవాదం', 'లెప్ట్యండ్ డ్రైవ్' ఆయన రచనల్లో కొన్ని. 'గ్రేట్ రివోల్ట్- ఎ లెఫ్ట్ ఎప్రైజల్, 'గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్- ఎ మార్క్సిస్ట్ పెర్స్పెక్టివ్' గ్రంథాలకు ఆయన సంపాదకత్వం వహించారు.