Satakamulu Vemana, Sumathi, Bhaskara, Krishna

పి . వి .కె .ప్రసాద రావు / P.V.K PRASAD ROA · Literature

Satakamulu Vemana, Sumathi, Bhaskara, Krishna book cover

Price: Rs. 157. బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, వరవారి నీతి శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్తీశ్వర శతకము, సింహశతకము వంటి పెద్ద శతకాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవారు. నేటి కాలంలో శతక పఠనం పాఠశాలలో కేవలం తెలుగు పాఠ్య గ్రంథాలలోని కొన్ని పద్యాలకే పరిమితమై పోయింది. తకపఠనం వల్ల బాలబాలికలలో జ్ఞాపకశక్తి, ధారాశుద్ధి, వాకుృద్ధి, భాషా సంపద, భావనా శబలత, మనోవికాసము, లోకానుభవము, సత్ప్రవర్తన, దైవ చింతన వృద్ధి పొందుతాయి. సుప్రసిద్ధములైన తెలుగు శతకాలను బాలబాలికలచేత పఠింపజేసి వారిని స్వభాషా, భూసంస్కృతీ సంప్రదాయ నిష్ఠులుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు ధార్మిక సంస్థలు, సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, అవిరాళంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ కృషిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా బహుళ ప్రచారం పొందిన భక్తి శతకాలను, నీతి శతకాలను టీకా తాత్పర్య సహితంగా ప్రచురించి సాధ్యమైనంత తక్కువ వెలకు విద్యార్థి లోకానికి అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించిందే ఈ శతక సాహిత్యమాల.

Browse more Telugu books