Sarigama Sagar
డి. సుందరరావు / D. Sundararao · Novels

Price: Rs. 162. సాగర్ సంధ్యల జీవితంలో అననుకూల పరిస్థితులు, వాటివల్ల వారు కోల్పోయిన విలువైన కాలం అంతా సంఘటనాత్మకం చేసారు రచయిత. ప్రధానంగా ఈ 21వ శతాబ్దంలో కూడా ప్రేమకు అవరోధంలుగా కులసమస్య ప్రాధాన్యత సంతరించుకోవడం శోచనీయం అనిపించినా, వర్తమానంలో జరుగుతున్న 'పరువు హత్యలు', వాటి పరిణామాల నేపథ్యంగా ఈ నవల్లో రచయిత పేర్కొన్న కులసమస్య సాదాసీదా అన్పించదు. వెంకట రమణశాస్త్రి నాట్య సంస్థ శిష్యులశిక్షణ శంకరాభరణం సినిమాను తలపుకు తెస్తుంది. ఈ నవల్లో రచయిత నాట్యశాస్త్ర మూలాలను, ఆవిర్భావ వికాస విషయాలను నవలా ఇతివృత్తానికి ఆప్ట్ అందించారు. బరువైన సంఘటనలు బలమైన సంభాషణలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. సాగర్ సంధ్యల జీవితాలు కళకే అంకితం అన్నదే ఈ నవల మూలసూత్రం. ప్రతి కోణంలోను అంశ విస్తరణ ఈ నవల్లో విశేషంగా అన్పిస్తుంది. ఈ నవల దుఃకఖాంతంగా ముగిసినా, విజ్ఞాన సర్వస్వంగా ఇది శాశ్వతం – అన్న సత్యం ఈ నవల్లో స్థిరపర్చారు రచయిత.