Santh ChokaMela
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 90. సంత్ చోఖా మేళా" పుస్తకరచయిత గనిశెట్టి రాములు గారు అనేక ప్రయాసాలకోర్చి ఈ పుస్తకాన్ని మనముందుకు తెస్తున్నారు. ఇందులో చోఖమేళా గురువుగా భావించే సంత్ నామ్ దేవ్ చోఖమేళా భార్య సోయరాబాయి, చోఖమేళా కుమారుడు కర్మమేళాల రచనలు బోధనలు మనకి ఇందులో కనిపిస్తాయి. చోఖమేళా అంటరాని కులాలపై అదీ మహారాష్ట్రలోని మహర్ కులంపై వేసిన బోధనల ప్రభావాన్ని గౌరవిస్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన రచనని చోఖమేళాకి అంకితం ఇవ్వడం జరిగింది. -డా॥జి.వి. రత్నాకర్, ఈ పుస్తకంలో చోఖామేళా జీవితానికి సంబంధించిన అనేక అంశాలు, శ్రమకోర్చి రచయిత పొందుపరచారు. మనమందరం రచయిత గారి శ్రమను, ఆలోచనను, రచనాస్ఫూర్తిని అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని చదివి, ఇతరులతో చదివించి, చోఖామేళా స్ఫూర్తిని ప్రజలకు చేరవేస్తారని ఆకాంక్షిస్తూ, ఈ పుస్తకం మరిన్ని కొత్త రచనలకు, కొత్త ఆలోచనలకు స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను. - డా|| గోపని చంద్రయ్య. శ్రీ సంత్ చోఖామేళా 14వ శతాబ్దములోని కవి. వారి సాహిత్యాన్ని, వారి గురించి సమాచారం సేకరించి మనముందు పాండురంగడు నృత్యము చేస్తున్నట్లుగా అక్షరాలని జోడించి అతన్నీ భక్తి నామ స్వరూపులే అని, అనేక దృష్టాంతాలతో పుస్తక రూపంలో మలిచినారు. -రాసూరి శివరాజ్ అడ్వకేటు నేను అంటరాని కులాలపై పోరాడిన పండరిపురం దేవాలయంపై పోరాడి, భక్తిమార్గం ద్వారా విముక్తి పొందిన చోఖామేళాను నేటి సమాజమునకు తెలియపరచవలసిన అవసరముందని గుర్తుచేస్తూ ఈ పుస్తకాన్ని రచించాను. - గనిశెట్టి రాములు