Sannihithula Gnapakalalo Ambedkar

C. Mrunalini / సి. మృణాళిని · Biographies & Auto Biographies

Sannihithula Gnapakalalo Ambedkar book cover

Price: Rs. 180. పత్రికాశీర్షికలకూ, చారిత్రక ఘట్టాలకూ అతీతమైన అంబేడ్కర్ గారి సన్నిహిత స్వరూపాన్ని పాఠకుల ఎదట పెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. అంబేడ్కర్ జీవితాన్ని వెలుగులతో నింపుతూ, ఆయన మరణంతోనే అంతరించిన కొన్ని యథార్థాలను పునర్దర్శించుకోవడం దీని లక్ష్యం. పుస్తకాల సేకరణలో ఆయన తపన, పట్టుదల, చురుక్కుమనిపించే ఆయన హాస్యకుశలత, వేసవి తుపాను బీభత్సం నుంచి ఇంట్లోకి అడుగుపెడుతూ వయొలిన్ వాదన విన్నప్పుడు ఆయనకు కలిగిన గొప్ప అనుభూతి... వీటన్నిటినీ మీ ముందుకు తెస్తుందీ పుస్తకం. ఇక్కడ మీకు ఆయన సహాయకులు, అనుచరుల మాటల్లో షేర్వాణీ, కుర్తాలు, లుంగీ, ధోవతులు, చివరకు ఎలాస్టిక్ చెడ్డీల పట్ల ఆయనకున్న మోహం గురించి తెలుస్తుంది. కుక్కల్ని ప్రేమించే అంబేడ్కర్, ఫౌంటెన్ పెన్నులను సేకరించే అంబేడ్కర్, గర్భనిరోధాన్ని, లైంగిక విద్యను సమర్థించిన అంబేడ్కర్, మద్యపాన నిషేధాన్ని కోరిన అంబేడ్కర్, మద్యాన్ని ముట్టని అంబేడ్కర్, అపుడపుడూ వంట కూడా చేసిన అంబేడ్కర్ ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఆయన వ్యక్తిత్వంలోని భిన్న పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవిత చరిత్రాన్వేషణలో మనకు ఎంతో సంతృప్తిని కలిగించే రచన ఇది.

Browse more Telugu books