SANGHAM(Girijana chaithanya addam pattina navala)

Editor · Novels

SANGHAM(Girijana chaithanya addam pattina navala) book cover

Price: Rs. 65. 1935వ సంవత్సరంలో జన్మించిన కె. చిన్నప్ప భారతి హైస్కూల్లో చదువుకునే రోజుల్నుంచే తమిళనాడు అభ్యుదయ ఉద్యమాలతో సంబంధాలు కలిగి వున్నారు. 1952-57 సంవత్సరాల్లో ఆయన సమైక్య విద్యార్థి ఉద్యమ కార్యకర్తగా పని చేస్తున్నప్పుడు, 1955న ఇండోనేషియాలోని బాండుంగ్ నగరంలో జరిగిన ఆఫ్రో- ఆసియా విద్యార్థి శాంతి సదస్సుకై ఎన్నికై అందులో పాల్గొన్నారు. రెండేళ్ళ తర్వాత మాస్కోలో జరిగిన ప్రపంచ యువజన మహాసభలో ఒక భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. చిన్నప్ప భారతి కళాశాల విద్యార్ధిగా వున్నప్పుడే 1954లో 'భూస్వామ్యం ఎప్పుడు ప్రారంభమైంది?' అనే తన కవితా సంకలనంతో తమిళ సాహిత్య రంగాన ప్రవేశించాయి. 1965 లో వెలువడ్డ ఆయన ప్రథమ నవల సాహిత్య వేత్తల ఆమోదం పొందింది. 1970లో ఆయన 'సెమ్మలర్' అనే తమిళ అభ్యుదయ సాహితీ మాసపత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరించారు. తర్వాత తాను సభ్యుడిగా వున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)కు దాన్నప్పగించారు. 1976న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడ్డప్పుడు ఆయన 'భారత భద్రతా చట్టం' క్రింద అరెస్టు చేయబడ్డారు. తమిళనాడు అభ్యుదయ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగానే గాక ఆయన పలు ప్రజా సంఘాలతో సంబంధం కలిగి వున్నారు. క్రియాశీల ట్రేడ్ యూనియన్ కార్యకర్త అయిన భారతి తమిళనాడు చెరకు ఉత్పత్తిదారుల సంఘాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన నవల 'దాహం'ను ఇంతవరకు వచ్చిన తమిళ నవలల్లో పది అత్యుత్తమ నవలల్లో ఒకటిగా విమర్శకులు పరిగణించారు. భారతి రెండవ నవల సంఘం ఆంగ్లంలోను, తెలుగులోను వెలువడి మళయాళం, హింది, కన్నడం, బెంగాలీ భాషల్లో కూడా అనువదింపబడుతోంది. 'సంఘం' నవల మద్రాసులోని ప్రసిద్ధ సాహిత్య సంస్థ 'ఇలక్కియ చింతనై' పురస్కారాన్ని 1987లో అందుకుంది. 7

Browse more Telugu books