SANATHA DHARMAM ANTE EMITI?

Editor · Caste, Religion & Culture

SANATHA DHARMAM ANTE EMITI? book cover

Price: Rs. 20. సనాతన ధర్మం మీద ఇటీవల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎవరి వివరణ వారు చెబుతున్నారు. సనాతన ధర్మం అంటే ఎవరు ఏ వివరణ ఇచ్చినా అంతిమంగా ప్రజలపై దాని ప్రభావం ఏమిటనేది పరిశీలించాలి. ఆనాడు ప్రజలు ఆచరించిన అనేక ఆచారాలను ఈనాడు దురాచారాలుగా గుర్తించి ఆధునిక ప్రభుత్వాలు చట్టాలు చేసి నిషేధించాయి. అంటరానితనం, సతీసహగమనం, బసివి, జోగినీ దురాచారం వంటివి ఆ కోవలోనివే. ఇవన్నీ ఆనాడు సనాతన ఆచారాలలో భాగంగానే అమలయ్యాయి. మనుస్మృతి వంటి గ్రంథాలు శూద్రుల్ని, దళితుల్ని, మహిళల్ని అణచి పెట్టి ఉంచే విధంగా దుర్మార్గమైన ఆచారాలను ధర్మాల పేరిట ప్రవచించాయి. భారతీయ సనాతన ధర్మాలు, సంస్కృతి పేరుతో ప్రచారం చేయబడుతున్నవి ఆచరణలో ప్రజలను విభిజంచి వివక్షతను, అసమానతలను వ్యాపింపజేశాయి. మానవ వికాసానికి ఆటంకంగా ఉండే ఏ ఆచారమైనా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించే ఏ ధర్మమైనా కాలానికి నిలబడదు. సనాతన ధర్మం గురించి చర్చించేటప్పుడు ఇటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అందుకు అధ్యయనానికి ఈ చిన్న పుస్తకం కొంత ప్రేమరణనిస్తుందని మా నమ్మకం.

Browse more Telugu books