Samudram

Editor · Literature

Samudram book cover

Price: Rs. 90. “ దర్వాజా' దాటగానే రెండువైపులా పేవ్మెంట్లపై పుస్తకాలు, పుస్తకాలు. మధ్యమధ్యలో గ్రా మఫోన్ రికార్డులు. ఒకచోట దిగ్గున ఆగిపోయాను. మార్థా! మార్థా సెబాస్టియన్! మార్థా ఎల్పీ పేవ్మెంటుపైనా! ఎన్నోసార్లు గుర్తుచేసుకుని బాధపడిన ఆ దృశ్యం ఇటీవల పదేపదే గుర్తుకువస్తున్నది. నాకైతే మనిషికి ఆఖరి శరణు పాటే అనిపిస్తున్నది” అని ఆయన దిగులుగా, బరువుగా కురోజు నుండి. అదేమాట ఆయన ఈమధ్య మరోమారు అన్నాడు. బైక్ మీద నేను వెనుక కూర్చుని ఉండగా, తను డ్రైవ్ చేస్తూ. ఎదురుగా జోరు గాలి. మాటలు వినపడ్డాయిగాని దిగులు, బరువూ గాలి జోరులో తెలియలేదు. మార్థా! ఏమి గొంతు అది! చెప్పలేను. పాటా? పాటేమిటి? ఆ గొంతే ఒక పాట. ఆ పాలో ఎన్నిసార్లు శరణు తీసుకున్నానో. నా మనో సముద్రపు లోతులలోకి వెళ్ళి, మనసునంతా భుక్తి- తడిమి జీవితంలో ఏవేవో గుర్తుకు తెచ్చి భయపెట్టే ఆ గొంతు... ఆఖరుకు అందరికీ ఏదో ఒక శరణు ఉండాలెసార్. ఒకడు ఏడుస్తడు, ఒకడు తాగుతడు, ఒకడు ఇంకేందో చేస్తడు... నాకైతే” అని ఆగిపోయాడు ఆయన ఇంకొక రోజు. మాట పూర్తి వేయలేదేమా అని ఎదురుచూడలేదు నేను. తక్కిన మాటేమిటో తెలియకపోతేగదా. తను నలెందుకు పూర్తిచేయలేదు? అక్కడినుంచి నిస్సహాయంగా ఆలోచనల్లోకి జారిపోయి ఉంటాడు. ముఖంలోకి చూసాను. గాజులా ఉంది.

Browse more Telugu books