Samrajyavadam
Rachamallu Ramachandra Reddy / రాచమల్లు రామచంద్రారెడ్డి · Politics

Price: Rs. 180. సామ్రాజ్యవాదుల మధ్య ఐక్యత ఇంతపెరిగినా, వైరుధ్యాలన్నీ తీవ్రతరం కావడం ఫలితంగా అనేక ఘర్షణలు, రకరకాల యుద్ధాలు ఈ దశ లోకూడా పెరుగుతూనే వున్నాయి. ఈ పరిణామాలు ఆయా దశల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు వివిధ దేశాల్లో పురోగమించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. అటువంటి పోరాటాల్లో సాధించే పురోగతిని నిలబెట్టుకోవడం, వివిధ దేశాల్లో పురోగమించే ఉద్యమాల నడుమ సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ పోరాటాల నడుమ పటిష్టమైన సౌహార్ద్ర సంబంధాలను నెలకొల్పుకోవడం, సంపన్న దేశాల్లోని కార్మికవర్గ పోరాటాలతో (ఈ దేశాల్లో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, సంక్షేమ పద్దులకు కోతవంటివి స్థానికంగా పెరిగిపోతాయి) సంబంధాలు పెంపొందించుకోవడం జరగాలంటే దానికి సైద్ధాంతికంగా ఒక కొత్త ముందడుగు వేయడం అవసరం. అటువంటి నూతన సిద్ధాంత ప్రాతిపదిక మీదనే సరైన వ్యూహాన్ని ఎత్తుగడలను రూపొందించడం సాధ్యపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇప్పుడు సైద్ధాంతికంగా ఒక శూన్యత నెలకొనివుంది. దానిని పూడ్చడానికి మార్క్సిజాన్ని పునర్నిర్మించాలి. లెనిన్ సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ గ్రంధం ఆ కాలంలో ఏ విధంగా ఆ పని చేయగలిగిందో. ఇప్పుడూ అటువంటి పని జరగాలి. అది చేయడానికి ముందు లెనిన్ సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ గ్రంధాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దానిని అర్థం చేసుకోవాలి. - ప్రొ|| ప్రభాత్ పట్నాయక్