Sammohanasthram
Editor · Politics

Price: Rs. 450. ప్రపంచ గతినే మార్చేసిన ఉపన్యాసాలు ఉన్నాయి. దేశదేశాల్లో కొందరు నేతలు చేసిన ఉపన్యాసాలు చరిత్రలో చెరిగిపోనివిగా నిలిచిపోయాయి. కొందరు నేతలు చేసిన ప్రసంగాలు ప్రపంచ ప్రసిద్ధి వహించిన మహోపన్యాసాలుగా నిలిచాయి. చరిత్ర ఒక మలుపుకు తిరిగే సందర్భంలో మాట్లాడిన మాటలు చరిత్రగానే విలుస్తాయి. ఒక వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించటానికి ముందు ఆ ప్రజాసమూహానికి ప్రతీకగా చేసిన ఉపన్యాసాలు ఈ మట్టి ఉన్నంత కాలం నిలిచి ఉంటాయి. ఒక వర్గాన్ని మరో వర్గం కూల్చడం కావచ్చు. ఒక వ్యవస్థ స్థానంలో మరో వ్యవస్థను నిర్మాణం చేయడం కావచ్చు. తరతరాలుగా పాతుకుపోయిన పాతఆధిపత్యవ్యవస్థ పునాదులను కూకటివేళ్లతో పెకలించివేసే సందర్భంలో ఆ జాతి మొత్తాన్ని ఒక్క తాటిమీదకి తెచ్చి నిలిపే ఉపన్యాసాలుగా (గ్రేట్ డిబెట్స్) నిలిచిపోయాయి. తమ మాటల్ని మంత్రాలను చేసి మొత్తం జాతిని మేల్కొలిపిన ఉపన్యాసాల వల్ల వాళ్లు జాతీయనాయకులుగా, ప్రపంచ ప్రసిద్ధి వహించిన నేతలుగా నిలిచిపోయారు. సోక్రటీస్ దగ్గర్నుంచి సోషలిజాన్ని నిర్మించేందుకు ఖడ్గదారిగా ముందుకుసాగిన స్టాలిన్ వరకు జీసెస్ దగ్గర్నుంచి మార్టిన్లూథర్కింగ్ వరకు, అబ్రహం లింకన్ నుంచి నెల్సన్ మండేలా వరకు, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ నుంచి మధరెథెరిసా వరకు, లెనిన్ నుంచి చెగువేరా వరకు చేసిన ఉపన్యాసాలు ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేనివి.