Samakya...Swechha! series 10

Editor · History

Samakya...Swechha! series 10 book cover

Price: Rs. 100. 1939లో నాటి బ్రిటీషు ఇండియాలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ “గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935” ను అంగీకరించి ఉన్నాయి. అంతేకాదు! ఆయా పార్టీలు చాలావరకు నాటి చట్టంలోని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా అమలుపరచాయి. ఈ సమాఖ్య నిర్మాణాన్ని కేంద్ర స్థాయిలో అంగీకరించటమనే విషయంలో రాజకీయ వర్గాలు సందిగ్ధంలో పడ్డాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్కు భావి భారత భవిష్యత్తుపై ధృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రాలతో కూడుకున్న బలమైన కేంద్రం ఉండాలని, పురాతన కుళ్లిన వ్యవస్థకు ప్రతీకలుగా ఉన్న 624 చిన్న పెద్ద సంస్థానాలను సమూలంగా మార్చాలనే భావన ఉండింది. ఈ సమాఖ్య విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించటానికి సన్నద్ధమవుతున్న డా॥ అంబేడ్కర్కు గోఖలే ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన ఆహ్వానం ఒక సదవకాశంగా లభించింది. విజ్ఞానవంతుల వేదికలో ప్రసంగించటానికి డా॥ అంబేడ్కర్ చక్కగా ఉపయోగించుకున్నాడు, ఉపన్యాస ప్రతిని ముందుగా రాసుకొని గోఖలే ఇనిస్టిట్యూట్లో ప్రసంగించారు.

Browse more Telugu books