Samajyavadam prapancaniki pramadam
Prabhat Patnaik / ప్రభాత్ పట్నాయక్ · Politics

Price: Rs. 135. మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు భారత ప్రజల్లో ముఖ్యంగా కార్మికవర్గం, రైతాంగంలో తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న కార్మిక పోరాటాలు, రైతాంగ ఉద్యమాల్లో ఈ అసంతృప్తి ప్రతిబింబిస్తోంది. భారత దేశంలో నయా-ఉదారవాదం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు 24 సార్లు కార్మిక సమ్మెలు జరిగాయి. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 9 సార్లు సమ్మెలు జరిగాయి. లేబర్ కోడ్లను నిరంకుశంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న తరువాత 5 సమ్మెలు జరిగాయి. ఈ కార్మిక పోరాటాలకు రైతాంగపు మద్దతు మరింతగా పెరుగుతుంటే రైతాంగ ఉ ద్యమాలకు కార్మికులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రానున్న కాలంలో ఈ సమైక్య పోరాటాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల అసంతృప్తి నుండి శ్రామిక ప్రజల దృష్టి మళ్లించేందుకు, పోరాటాల్లో ఏర్పడిన సమైక్యతను చెడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి అడుగడుగునా మతవిద్వేషాలు రెచ్చగొడుతోంది. నిజానికి హిందూత్వ సిద్ధాంతం హిందూ మతానికి సంబంధించినది కాదు. అది దేశంలో పాలక వర్గాలకు, అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదులకు తోడ్పడే ఒక రాజకీయ విధానం మాత్రమే. అందువల్ల దేశంలో కార్పొరేట్- హిందూత్వ విధానాలను సమైక్యంగా తిప్పికొట్టి ప్రత్యామ్నాయ విధానాలవైపు దేశాన్ని తీసుకుపోయినప్పుడు మాత్రమే సామ్రాజ్యవాదులకు లొంగిపోయే విధానాలను కూడా ఓడించగలం. ఈ విషయాన్ని అర్ధం చేసుకోడానికి కూడా ప్రభాత్ పట్నాయక్ రాసిన ఈ పుస్తకం మనకు తోడ్పడుతుంది.