Samaajika Viplavakaarudu Pothuloori Veerabrahmam

Editor · History

Samaajika Viplavakaarudu Pothuloori Veerabrahmam book cover

Price: Rs. 110. బ్రహ్మంగారు తాత్వికుడు కావడానికి తాను పుట్టి పెరిగిన శతాబ్దిలోని ఆయా పరిస్థితులే హేతుభూతాలయ్యాయని చెప్పవచ్చు. - కన్నెకంటి రాజమల్లాచారి బ్రహ్మంగారు చేసిన గురుబోధలు ఎంతో గుట్టుగా ఉన్నా పామర జనం గుండెలలోకి సూటిగా దూసుకుపోయే బాణాల వంటివి. -ఆరుద్ర వీరబ్రహ్మం తాత్విక భావధార అచలయోగ సంబంధి. - కె. కాత్యాయనీ విద్మహే వీరబ్రహ్మం నడిపిన ఉద్యమం చాలా విశాల దృక్పథంతో నడిచింది. బుద్ధుడిలాగా ఈయన స్వార్థాన్నీ, సామాజిక అసమానతల్నీ ద్వేషించాడు. -జి. లక్ష్మీనరసయ్య వీరబ్రహ్మం తానేది చెప్తున్నారో దాన్ని ఆచరించి చూపడానికి వీలుగా కులమతాలకు అతీతంగా వివిధ వృత్తుల వారిని దగ్గరకు చేర్చుకున్నారు. - దార్ల వెంకటేశ్వరరావు ఎవరు చెప్పినా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పారు. కాని అందరూ సమానమవుతారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే చెప్పారు. -కడియాల సుబ్బనాచారి బ్రహ్మంగారు కేవలం ఒక అధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు. ఛాందస భావాలు లేని ఒక అభ్యుదయవాది కూడా - మందరపు హైమవతి

Browse more Telugu books