Sajeeva Dhahanam
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 100. మూలభారతీ ఉద్యమ పితామహుడు బత్తుల శ్యాంసుందర్ జననం: 21 డిసెంబర్ 1908 ఔరంగాబాద్, జిలనాజిల్లా, నిజామ్ హైదరాబాద్ రాష్ట్రం. విద్య : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి, ఆర్థిక, న్యాయశాస్త్రాలలో ఉన్నత విద్య 1931-34: నిమ్మజాతుల యువకులను సమైక్య పర్చడానికి యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు. 1932 : మెంబర్ ఆఫ్ స్వదేశీ లీగ్, లైబ్రరీ సొసైటీ ఆఫ్ హైదరా బాద్ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. రౌండ్ టేబుల్ సమావేశాలకు బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు మద్దతుగా యుత్ లీగ్ ఆఫ్ అంబేడ్కరైట్ స్థాపన. 1946 : నిజాం ప్రభుత్వంచే పీస్ అండ్ సోషల్ సర్వీసుగాను ఖుసురూ-ఎ-డక్కన్ అవార్డు బంగారు పతకం బహుకరణ. 1947 : గ్రాడ్యూయేట్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నిక : ఉస్మానియా సెనెట్ కౌన్సిలు ఎన్నిక : నిజాం స్టేట్‌లో షెడ్యూల్డు కులాల ప్రజా ప్రతినిధులను ఆ ప్రజల చేతనే ఎన్నుకోబడే విధంగా సెపరేట్ ఎలోక్టరేట్స్ను ప్రవేశపెట్టాలని 24 వేల గ్రామాల 50, 000 మంది ప్రజలతో మహార్యాలీ నిర్వహణ. 1948 : హైదరాబాద్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక. : హైదరాబాద్ అసెంబ్లీచే ఆమోదించబడిన ఒక కోటి రూపాయల షెడ్యూల్డు క్యాస్ట్స్ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటులో కీలకపాత్ర: ట్రస్ట్ ఫండ్ ట్రస్టీగా ఎన్నిక. 1952 : మొదటి జనరల్ ఎన్నికల్లో హైదరాబాద్ లోని మలక్‌పేట నుండి పోటి. 1968 : భారతీయ భీమసేన వ్యవస్థాపన, స్వయం రక్షణ, స్వయం అభివృద్ధి, స్వాభిమాన ఉద్యమంగా దేశ వ్యాప్తంగా నిర్మాణం. : డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యూకేషన్ సొసైటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నిక: మరాట్వాడాలోని మిలిండ్ కాలేజీ, విద్యా సంస్థల నిర్మాణం కొరకు 12 లక్షల రూపాయలను ట్రస్ట్ ఫండ్ నుండి ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆంధ్ర ప్రభుత్వం కోర్టులో కేసు పెడితే దాన్ని స్వయంగా వాదించి గెలిచాడు. 1972 : ప్రత్యేక తెలంగాణ కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా వున్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ప్రధానమంత్రికి బహిరంగ లేఖ. 1975 : మే