Sahityam lo Viplavam Sri Sri

Editor · Stories & Poetry

Sahityam lo Viplavam Sri Sri book cover

Price: Rs. 45. భూర్జువా వర్గానికి ఒక సరదాఉంది అది అన్ని విలువలనీ అపహాస్యం చేస్తుంది. - 'సోర్బోన్' విశ్వవిద్యాలయం గోడమీద రాత (1968) 'జాతీయం' చేయడం అంటే జాతిపరం చెయ్యడం అనే ఉదాత్త జాతీయోద్యమ భావన ఆనక ఎంతటి అపహాస్యానికి గురయిందీ మనకు తెలిసిందే. 'ఏరా పెన్ను బాగుంది ఎక్కడ జాతీయం చేసావ్' 'జనగణమనేనా ఇలా జాతీయోద్యమ కాలంనాడు రూపొందించుకున్న ఉదాత్తభావనలన్నీ అపభ్రంశమార్గం పట్టాయి. బూర్జువావర్గం సరదా అలాంటిదిమరి. "ఈ ప్రపంచానికి "స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం' అన్న నినాదాన్ని ఫ్రెంచి విప్లవం అందించింది 'రష్యావిప్లవం' 'చైనా విప్లవం' వియత్నాం విప్లవం 'క్యూబావిప్లవాలు' 'మరో ప్రపంచం సాధ్యమే' అన్న ఆశావహ దృక్పధాన్ని ఈ ప్రపంచానికి అందించాయి. దాంతో పీడితులు ఎక్కడ ఈ విప్లవాల వెంటబడిపోతారో అన్న గుబులుతో పీడకశక్తులు ఈ 'విప్లవం' అన్న పదాన్నే పలుచన చెయ్యడానికి యధాశక్తి కృషి చేసాయి. 'సస్యవిప్లవం' 'క్షీరవిప్లవం’ 'నీలివిప్లవం' తో మొదలుపెట్టి నిన్నామొన్నటి 'డిజిటల్ విప్లవం' వరకూ అన్నీ 'విప్లవాలు'గా చలామణి చేసాయి. కానీ సాంస్కృతిక విప్లవం' 'సాహిత్యవిప్లవం' జోలికి మాత్రం పోలేదు ఈ రెండు విప్లవాలూ జరిగితే వాళ్ళ అడుగు జారిపోతుందని పాలకులకు తెలుసు. అందుకే వీటి జోలికి పోలేదు, పోరుకూడా ... సాహిత్యంలో అలాంటి విప్లవప్రకంపనలు సృష్టించిన మహాకవి 'శ్రీశ్రీ' రచించిన ఈ ఎంపికచేసిన వ్యాసాలసంపుటి సాహిత్యకారుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. సాహిత్యానికి సాంఘికప్రయోజనం ఉండితీరాలని నొక్కి చెప్పిన మహాకవి వాక్కు సదాస్మరణీయం, అనుసరణీయం. - సాహితీ స్రవంతి

Browse more Telugu books