Sahithi Sugandam

Editor · Best Selling

Sahithi Sugandam book cover

Price: Rs. 90. డా|| పి.వి.సుబ్బారావు 1950 ఫిబ్రవరి 12వ తేదీన ప్రకాశం జిల్లా, బోడపాలెం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి వేంకట లక్ష్మమ్మ, రంగయ్యలు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి యం.ఏ., తెలుగు (1972) డిగ్రీ పొందారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి అనిశెట్టి సాహిత్యానుశీలనం సిద్ధాంత గ్రంథం రాసి పి.హెచ్.డి., పొందారు (1993). చిలకలూరిపేట చుండి రంగనాయకులు కళాశాల తెలుగుశాకలో 1972 ఆగస్టులో లెక్చరరుగా చేరి, రీడరుగా, శాఖాధిపతిగా, వైస్ ప్రిన్సిపల్గా పదోన్నతులు పొంది, దాదాపు 36 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ తెలుగ బోర్డ్ ఆప్ స్టడీస్ ఛైర్మన్ గా, పరిశోధనా పర్యవేక్షకులుగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ పాఠ్యణాళిక సభ్యులుగా, గుంటూరు జిల్లా అధికార భాషా సంఘం సభ్యులుగా, సేవలందించారు. టెట్, డి. యస్సీ, డి. సెట్ వంటి పోటీపరీక్షలకు సాక్షి విద్య ద్వారా తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించి దాదాపు 150 వ్యాసాలు రాశారు. వివిధ పత్రికల్లో 100 విమర్శ వ్యాసాలు ప్రచురించారు. ప్రత్యేకించి సాఫ్ట్స్కేల్స్ ట్రైనర్గా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా వివిధ కళాశాలలకు చెందిన దాదాపు 20,000 మంది ఇంజనీరింగ్, యం.బి.ఏ., సివిల్సస విద్యార్ధులను ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా ప్రేరేపించారు. సామాజిక సేవ, సాహితీ సాంస్కృతిక సభల నిర్వహణ పుస్తకపఠనం అభిరుచులు.

Browse more Telugu books