Sahajeevanam

NT Books · Novels

Sahajeevanam book cover

Price: Rs. 150. ప్రపంచ కథా సాహిత్యం చదవటం ఎప్పుడూ ఒక అద్భుతమైన అనుభవమే. ఆయా దేశాల సంస్కృతీ, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాలను అర్థం చేసుకోవటంకోసమూ, ప్రపంచ సోదరభావం పెరగటం కోసమూ ప్రపంచసాహిత్యాన్ని చదవటం ఒక అవసరం. సైద్ధాంతిక, రాజకీయ గ్రంథాలలో అందని, అర్థం కాని ఎన్నో విషయాలని మనం కథలు చదవటం వల్ల తెలుసుకోవచ్చు. సాహిత్యం చేసిన మ్యాజిక్ అదే. అందుకే వివిధ దేశాల కథలని చదవటం ఎప్పుడూ మంచి అనుభూతినిచ్చే విషయం. అయితే అన్ని భాషలలోని కథలని చదవటం చాలా కష్టం. ఆ కథలనన్నిటినీ మన భాషలోనే చదువుకోవటం సులభం. అందుకే అనువాద కథలని ప్రపంచ కథా కరచాలం పేరుతో ఒకచోట చేర్చాలనే ఆలోచన చేశాం. వివిధ దేశాల, ఆయా భాషల కథలని ఒక దగ్గర చేర్చి పాఠకులకి అందించాలనే ప్రయత్నమే ఈ పుస్తకాల సిరీస్ తేవటానికి కారణం. గతంలో ఇటువంటి ఎన్నో పుస్తకాలతో పాటే ఈ కథలు కూడా మీలోని జిజ్ఞాసనీ, కథా దాహాన్నీ తీరుస్తాయని ఆశిస్తూ...

Browse more Telugu books