SAHAJA
ఓల్లా / Volga · Novels

Price: Rs. 135. వాళ్ళు నలుగురు! కాలేజీ రోజుల్నుంచీ వున్న ప్రాణస్నేహం ఆ నలుగుర్నీఆ తర్వాత కూడా సన్నిహితంగా బంధించి వుంచింది. ఒకరికి చిత్రలేఖనంలో అభినివేశం! మరొకరికి సంగీతంపై అభిరుచి! ఇంకొకరికి పుస్తక పఠనాభిలాష! ఆ ముగ్గురి ఇష్టాలపై రెట్టింపు ఇష్టాన్ని పెంచుకుంది నాల్గవ నేస్తం! ఆ ప్రభావంతో... “స్నేహం, ప్రేమ నాజీవితాశయం" అని చెప్పుకున్న సహజకి ఆతర్వాత ఎదురయిన అనుభవాలేమిటి? చివరికి ఆమె-"చిన్నప్పటి నుంచీ మీరే-పాటలు పాడీ, బొమ్మలు వేసీ, దొరికిన పుస్తకమల్లా నాచేత చదివించీ, నాకీ పిచ్చి ఎక్కించారు. ఇపుడు మీరు హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నేనింకా ఈ పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నాను” అని ఎందుకు అనవలసి వచ్చింది. ఆమె అలా తన స్నేహితురాళ్లపై మోపిన ఆ అభియోగంలోని వాస్తవం ఏమిటి? *** మన పురుషాధిక్య సమాజంలో వివాహానంతరం స్త్రీ జీవితం చెందే పరిణామాల్ని భిన్నస్వభావాలు గల భర్తలకనుగుణంగా భార్యలు అవలంభిస్తున్న రాజీ మార్గాల్ని ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రించిన ఓల్గా రచన 'సహజ'