Sachitra Jyothiba Pule Jeevanam
Editor · History

Price: Rs. 110. విమల్ కీర్తి గారు బౌద్ద అధ్యయన శీలిగా, విద్యావంతుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతము నాగపూర్ విశ్వవిద్యాలయంలో పాలి-ప్రాకృతి భాష విభాగాధిపతిగా వున్నారు. మహారాష్ట్రలోని బండారా జిల్లాలోని దేవరిదేవ్ గ్రామంలో 1949, ఫిబ్రవరి 5న షెడ్యూల్డ్ కులంలోని మహర్ సామాజిక వర్గంలో ఆయన జన్మించారు. 1956 నుండి బాబాసాహెబ్ డా॥ అంబేడ్కర్ యొక్క ధమ్మక్రాంతితో ప్రభావితుడైన విమల్కీర్తి తండ్రి బౌద్ధమతం తీసుకొని తన కుటుంబాన్ని ఒక ఆదర్శ బౌద్ధ పరివారంగా మార్చి జీవనం కొనసాగిస్తున్నారు. విమల్కీర్తి గారు ప్రముఖ బౌద్ధాచార్యులు బదంత్ ఆనంద్ కౌశల్యాయన్తో కలసి చాలారోజులు పనిచేసారు. వారి ప్రభావంతోనే పాలీ భాష, సాహిత్యం, బౌద్ధాన్ని అధ్యయనం చేయుటలో ఆసక్తి పెరిగింది. విభిన్న పత్రికల్లో నిబంధనలు మరియు పరిశోధన పత్రాలు అనేకం ప్రచురించబడ్డాయి. విమల్కీర్తి గారు రాసిన అనేక పుస్తకాలు ప్రచురణగావించబడ్డాయి. హిందీ భాషలో అంగుత్తర్ (త్రైమాసిక) పత్రిక సంపాదకులుగా ఆయన ప్రసిద్ధులు. ఎంతో స్ఫూర్తిదాయకమైన మహాత్మాజోతిరావు ఫూలే సాహిత్యాన్ని హిందీ భాషలోకి ఎక్కువగా అనువాదం చేసిన ఘనత అతనికే దక్కుతుంది. అటువంటి పుస్తకాలలో సచిత్ర జ్యోతిబా పూలే జీవనం ఒకటి. సమాంతర తరపున దీన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నందుకు గర్వంగా వుంది.