Sachalana Shathabdam
Editor · History

Price: Rs. 65. సంచలనాత్మక 20వ శతాబ్దం గురించి ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్ బామ్ విశ్లేషణ ఇది. ఇటలీకి చెందిన ఆంటోనియో పోలిటోతో జరిపిన ఈ సంభాషణలో గడిచిన దశాబ్దం మనకిచ్చినదేమిటి? 21వ శతాబ్దం తీరుతెన్నులపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? లాంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానాలను ఆయన దీనిలో వివరిస్తారు. ఓ రకంగా 'ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రామ్స్: దిషార్ట్ ట్వంటీయత్ సెంచురీ 1914-1991'కి ఇది కొనసాగింపు. 1917లో అలెగ్జాండ్రియాలో జన్మించిన ఎరిక్ హాబ్స్ బామ్ వియన్నా, బెర్లిన్, లండన్, కేంబ్రిడ్జిలలో విద్యనభ్యసించారు. బ్రిటిష్ ఆకాడెమీ, అమెరికన్ ఆకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో ఫెలోగా ఉన్నారు. లండన్ విశ్వవిద్యాలయం బిర్క్బెర్క్ కాలేజీలో వదవీవిరమణ చేసేంతవరకు చరిత్ర ఉపన్యాసకులుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ లోని న్యూస్కూల్ ఫర్ సోషల్ రీసెర్చ్లో పనిచేస్తున్నారు. 'ఏజ్ ఆఫ్ రివల్యూషన్ 1798-1848', ఏజ్ ఆఫ్ క్యాపిటల్ 1848-1875', '໖໖ ໑ 2 1875-1914 ఇతర ప్రసిద్ధ గ్రంథాలు.