SABARIMALA kerala alaya samajika charitra
Editor · Best Selling

Price: Rs. 100. విశిష్టమైన శబరిమలకు కేవలం పురుషులు మాత్రమే వెళ్ళాలి. నెలసరి వయసులో ఉన్న మహిళలు శబరిమలను సందర్శించడం నిషిద్ధం. సరిగ్గా ఈ అంశంపైనే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ వాగ్వివాదాలు, ఆందోళనలు అసలు అయ్యప్ప ఎవరు, శబరిమల చరిత్ర ఏమిటి అన్న మూలప్రశ్నను ముందుకు తెచ్చాయి. శబరిమల సందర్శనపై స్త్రీలకు నిషేధం మొదటి నుండీ ఉండేదా లేక మధ్యలో వచ్చి చేరిందా? శబరిమలపైన, అయ్యప్ప దేవునిపైన గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న బ్రాహ్మణవాద హిందూ మత శక్తులు ఆది నుండీ అక్కడ ఉన్నాయా? ఇలాంటి అన్ని అంశాలను యువ పరిశోధకుడు జితీష్ పి.ఎం. రచించిన ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది.