RSS: Desaniki Pramadam
Editor · Best Selling

Price: Rs. 180. ఎ.జి.నూరానీ భారత రాజ్యాంగ నిపుణుడు, రాజకీయ వ్యాఖ్యాత. బొంబాయి హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మతతత్వ రాజకీయాలపైనా, భారత దేశ రాజ్యాంగం, ఇతర అంశాలపైనా ఆయన అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. పలు విషయాలపై ఆయన రాసిన అనేక పుస్తకాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. “ది ఆర్ఎస్ఎస్ ఎ మెనేస్ టు ఇండియా" అన్న శీర్షికతో నూరానీ రాసిన గ్రంధానికి సంక్షిప్తానువాదమే మీ చేతిలో ఉన్న పుస్తకం. నూరానీ రాసిన పలు పుస్తకాలను లెఫ్ట్వేర్డ్ బుక్స్ సంస్థ ప్రచురించింది. వాటిలో ఆర్ఎస్ఎస్ - బిజెపి, సావర్కర్ - హిందుత్వ, ఇస్లామ్-జిహాద్ అనే పుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఫ్రంటైన్, డాన్ పత్రికలకు రాస్తున్నారు.