RSS Asalu Nijam

NT Books · Politics

RSS Asalu Nijam book cover

Price: Rs. 100. భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని, అందరికీ సమానమైన పౌరసత్వ హక్కులని కాపాడడంలో కీలకమైన వ్యవస్థలు అన్నీ సాగిలబడి లొంగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో బహుళత్వం, సుహృద్భావంతో కూడిన భారతదేశాన్ని తిరిగి నిలబెట్టాలనే బృహత్తర కర్తవ్యాన్ని షంసుల్ ఇస్లాం పుస్తకం మనకు గుర్తుచేస్తున్నది. లోతైన ఆర్ ఎస్ ఎస్ మూలాలనీ, దాని చరిత్రనీ, దేశంలోని సకల రంగాలలోని సంస్థలన్నింటినీ పథకం ప్రకారం అది తన అధీనంలోకి తెచ్చుకున్న వైనాన్నీ షంసుల్ ఇస్లాం వివరించారు. తద్వారా, మన ప్రతిఘటన మార్గంలో రాజ్యాంగ మూల సూత్రాల మీద ఆధారపడి మనం చేయాల్సిన నిర్మాణాత్మక కృషిని మన ముందుంచారు. రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. రాజ్యాంగ విలువలు ధ్వంసం అయ్యే తక్షణ ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో. వలస కాలపు ఆర్ఎస్ఎస్ తో మొదలు పెట్టి. ప్రత్యేకించి 1990 తర్వాత సంఘ్ పరివార్ రాజకీయ పరిణామాన్ని వివరించారు. మనం మన భారతదేశాన్ని పునర్నిర్మించుకునే గురుతర కర్తవ్యాన్ని రాజ్యాంగ పునరుద్ధరణ కృషి తోటే ఆరంభించాలి. అప్పుడు మాత్రమే, 'భారత ప్రజలమైన మేము' అని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న విధంగా ఈ దేశం అందరిదీ కాగలుగుతుంది. - కల్పన కన్నబిరన్

Browse more Telugu books