Rita Nerchina Paatham-1975-1985 Jnapakaalu

Editor · Politics

Rita Nerchina Paatham-1975-1985 Jnapakaalu book cover

Price: Rs. 180. ఢిల్లీ అంటే కుతుబ్ మినార్, ఇండియా గేట్, పార్లమెంటు భవనం, రాష్ట్రపతి నిలయం చుట్టి రావడమే కదూ! రండి ఇప్పుడు మీకు అదే ఢిల్లీలో అనేక మంది మార్జినోళ్లను, టెక్స్టైల్స్ కార్మికులను, స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వాలను పరిచయం చేస్తుంది ఈ పుస్తకం. ఎమర్జెన్సీ కాలంలో అణచివేతకు గురయిన కార్మికుల, పట్టణ సుందరీకరణ పేరిట కూల్చివేయబడిన పేదల వాడల, బస్తీల దయనీయ గాధలను తెలుసుకుందురు. వరకట్న హత్యలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు, ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత.. ఇలా ఒక దశాబ్ద కాలంలో దేశ రాజధాని నగరంలో చోటుచేసుకున్న సంచలనాత్మక, సంవేదనాత్మక ఘటనల సమాహారాన్ని మానవీయ కోణంలో అర్ధం చేసుకుందురు. రీటా నేర్చిన పాఠం ఏమిటో మీరూ తెలుసుకుందురు. మనకు తెలిసి రీటా, జూలీ అనేవి మన పాత తెలుగు సినిమాల్లో క్లబ్ డ్యాన్సర్ల పేర్లు. తెలుగు చలనచిత్ర సీమలో పిలకలు వేసిన అన్యమతాన్ని కించపరిచే ధోరణుల దర్పణాలు. కానీ ఈ రీటా ఒక ఆధునిక మహిళ. ఒక మెరుగైన ప్రపంచం ఆమె కల. ఆ కల సాకారం చెయ్యాలన్న లక్ష్యంతో పనిచేసే ఒక రాజకీయ శక్తిలో తానూ భాగస్వామి అయిన తీరు, ఆ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను మనతో పంచుకుంటుంది. ఈ రీటా వేరెవరో కాదు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కార్యకర్తగా మొదలిడి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎదిగిన బృందా కారత్ ఆత్మకథాత్మక కథనం ఇది.

Browse more Telugu books