Revu

జి.ఎస్. చలం / G.S. Chalam · Novels

Revu book cover

Price: Rs. 95. 'సాకలోడుగా మాత్రం అస్సలు పుట్టకూడదు' అనుకుంటాడు నారిసెట్టి. ఇంకొక అడుగు ముందుకేసి 'ఈ బతుకు వద్దే వద్దు' అని ఊరొదిలి విశాఖపట్నానికి వెళ్ళిపోతాడు రామిసెట్టి. పల్లె నుండే కాదు వృత్తి నుండి కూడా 50 ఏళ్ళ క్రితం మొదలైన ఈ వలస ఎప్పుడోసారి పూర్తి కాక తప్పదు. ఇవ్వాళ ఒక వాషింగ్ మెషీన్ లేదా రెండు చేతులతో ఎవరింట్లో వాళ్ళు చేసుకోగల పని కోసం ఇంతమందిని ఇంత కాలం ఇంత క్షోభపెట్టామే... అనుకోకుండా ఉండలేకపోయాను. చాకలివారి జీవితం మీద తెలుగులో వచ్చిన తొలి నవల బహుశా ఇదేనేమో. -వేమన వసంతలక్ష్మి వర్ణాశ్రమ ధర్మాల పేరుతో కొన్ని కులాల వాళ్ళను శాశ్వత బందీలుగా మార్చి చిత్రహింసలకు గురిచేసే వొకానొక గ్రామీణ ప్రాంతపు దుర్మార్గాల్ని రేవుకు పెట్టే నవల యిది. శ్రామిక జనుల జీవన యాతనలను నిర్దుష్టంగా చిత్రించిన యీ నవల అధో జగత్తు సోదరుల జీవితాలపైన వచ్చిన నవలలకొక కొత్త చేర్పు. - మధురాంతకం నరేంద్ర

Browse more Telugu books