Reservation Boghi

Jupaka Subhadra · Novels

Reservation Boghi book cover

Price: Rs. 140. దళితుల పట్ల తరతరాల వివక్ష, అణచివేతలు నేటికీ ఎలా కొనసాగు తున్నాయో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది ఈ రిజర్వేషన్ బోగీ కథాసంకలనం. ఒక సాంస్కృతిక చైతన్యానికి, చారిత్రక అవగాహనకు దారివేసే ప్రయత్నం చేశారు జూపాక సుభద్ర ఈ కథల ద్వారా. తిండి రాజకీయాల నుండి, వక్రీకరణకు గురవుతున్న చరిత్ర రాజకీయాల వరకు అనేకాంశాలను నిశితంగా విమర్శించారు. గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ పట్టణాల్లో నివసించే దళిత కుటుంబాలు సైతం కొత్త కొత్త రూపాలలో వివక్షను ఎలా ఎదుర్కొంటున్నారో పాఠకుల హృదయాలకు హత్తుకునే రీతిలో వర్ణించారు రచయిత్రి. తమ సమీప కులాల నుండి కూడ ఎలా వివక్షను, అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో కూడ తెలియచేస్తారు. ఇదే సమయంలో దళితులు తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి జరిపే పోరాటాన్నీ రచయిత్రి చక్కగా వర్ణిస్తారు. మనముందు కూర్చొని తెలంగాణ భాషలో అలవోకగా చెబుతున్నట్లుగా సాగుతాయి ఈ కథలన్నీ. దళితుల హృదయ ఘోషను అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కథలు ఇవి.

Browse more Telugu books