REPEKKADIKELTAV...!(Marikonni Bharateeya Anuvada Kadhalu)

Editor · Best Selling

REPEKKADIKELTAV...!(Marikonni Bharateeya Anuvada Kadhalu) book cover

Price: Rs. 140. ఇందులోని కథలన్నీ సమకాలీన సామాజికతను, చైతన్యాన్ని, మానవీయతను పెంపొందించేవిగా వుండటం వీటి ప్రత్యేకత. ఉద్యమాల స్ఫూర్తిని, మతతత్వాల వల్ల మనుషులకు కలిగే హానిని, మన సమాజంలోని కుల చట్రంలో మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో అనే అంశాన్నీ, రాజ్యహింస, నిర్భంధాల గురించి, ఉగ్రవాద మూలాలు, ఫలితాల గురించి పురుషాధిక్య సమాజంలో మహిళల ఇక్కట్ల గురించి, మానవ సంబంధాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి, మనుషుల మనస్తత్వాలను గూర్చి ఎంతో ప్రతిభావంతంగా కథలను తీర్చారు. మొత్తంగా అన్ని కథలలోనూ మానవీయతను ధ్వంసమొనరుస్తున్న అంశాల చిత్రణలు, సమాజంలోని అనేక రుగ్మతలను ప్రతిబింబిస్తాయి. సమతా భావాన్ని, సహనాన్ని కోరుకుంటాయి. ప్రసిద్ధులైన మన దేశీయ రచయితల కథలను తెలుగులోకి అనువదించి తెలుగు నుడికారపు సొబగులతో డా. రూప్ కుమార్ డబ్బీకార్ తీర్చిదిద్దారు. - కె. ఆనందాచారి

Browse more Telugu books