RENDU MAHANAGARALU
తెన్నేటి సూరి / Thenneti Suri · Novels

Price: Rs. 225. "తెన్నేటి సూరి అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడవునో కాదో నాకైతే తెలియదు కాని, అభ్యుదయ కవితా సంకలనాలు అచ్చుకావడానికి పూర్వమే అంటే 1946 లోనే అతని గేయ కవితా సంకలనం అరుణరేఖలు అచ్చు పడింది.... సూరి అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడైనా కాక పోయినా 'అరుణరేఖలు' కవితా సంకలనం సంఘం దృక్పథం కవిగా గుర్తించేటట్లు చేసింది. అభ్యుదయ రచయితల సంఘం దృక్పథం ఆ కవితా సంకలనంలో కవిత్వ కళగా రూపు కట్టింది" అని 'ఆంధ్రపత్రిక' (26-10-85)లో టి.యల్. కాంతారావుగారు ఒక సందేహం వెలిబుచ్చారు. ఈ సందేహ నివృత్తికి ఆయనే కొంత పరిశ్రమిస్తే బాగుండేది, మరొకరు సంజాయిషీ చెప్పకుండానే. తెన్నేటి సూరి అభ్యుదయ కవి. అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు. అభ్యుదయ రచయితల సంఘం రెండవ, మూడవ, నాల్గవ మహాసభల్లో (1944-48) ఆయన కార్యవర్గ సభ్యుడు, రాజమండ్రి మహాసభలో స్వయంగా పాల్గొన్నాడు కూడా. రచయితను ఆయన హెూదానుబట్టి గాక ఆయన సృజన్మాతక కృషిని బట్టీ, తన రచనలలో తన సంఘం దృక్పథాన్ని ప్రతిబింబించడాన్ని బట్టీ గౌరవిస్తాం. తెన్నేటి సూరి కవి. కథకుడు, నాటకకర్త, నవలా రచయిత తెలుగు సినిమా ప్రారంభమైన తొలి దినాల్లోనే 'టాకీ టెక్నిక్' లాంటి సాంకేతిక జ్ఞాన పరిచయ గ్రంథాన్ని రాసినవాడు. పైగా బహుకాలం పాత్రికేయుడు. తెన్నేటి సూరికి అభ్యుదయ దృక్పథం, నిబద్ధతేగాక, తన అభిప్రాయాలను శషబిషలు లేకుండా నిస్సంకోచంగా వెల్లడించే సాహసి. క్షేత్రయ్య కృష్ణశాస్త్రిలపై ఆయన సాగించిన విమర్శలు సమర్ధనీయమైనా కాకపోయినా సూరి నిజాయితీకి అవి గీటురాళ్ళు.